హత్య కేసులో నిందితుడైన సౌదీ రాజ కుటుంబ సభ్యుడిని అక్టోబర్ 18న ఉరి తీసిన సంగతి తెలిసిందే. అదెల్ అల్ మహ్మ ద్ అనే వ్యక్తిని 2012లో కాల్చి చంపిన సౌదీ యువరాజు టర్కిబిన్ సౌద్ అల్ కబీర్‌కు మంగళవారం రియాద్‌లో ఈ శిక్ష అమలు చేశారు. వారిరువురూ మంచి మిత్రులు కావడం గమనార్హం. ఓ రాజకుటింబీకుడిని ఉరితీయడం సౌదీలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. సౌదీలో చట్టాలు అందరికీ సమానమేనంటూ ఈ ఘటన చెప్పకనే చెప్పింది. సౌదీలో శిక్షలను బహిరంగంగానే విధిస్తారు. అయితే వాటిని వీడియోలు తీయడం నిషిద్ధం. అయితే ఈ చరిత్రాత్మక ఘటనను ఓ ఆగంతకుడు రహస్యంగా వీడియో తీశాడు. నడిరోడ్డుపై సౌదీ యువరాజును కాల్చి చంపేసిన వీడియోను మీరూ చూడండి..