Translate

Saturday, 14 January 2017

ramayana war secrets-legend రామాయణం

రామాయణంలో రాముడు రావణ సంహారం చేసిన సమయంలో… రావణుడు కొన ఊపిరితో ఉండగా… రాముడు  లక్ష్మణుడితో ఇలా చెబుతాడు. బ్రాహ్మనులలోని పండితుడైన రావణుడి దగ్గరకు వెళ్లి, ఎవరికీ తెలియని నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అప్పుడు రావణుడు ఏమి చెప్పాడంటే…


.మన రధసారధితో , కాపలావాడితో, వంట వాడితో నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా , ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడరు.




.ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు.
.నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు.



నీ శత్రువు చిన్నవాడు, తక్కువ వాడు అని తక్కువ అంచనా వెయ్యవద్దు. ఎవరి వెనుక ఎంత భలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను.
.దేవుడుని ప్రేమించవచ్చు లేదా ద్వేషించ వచ్చు కాని ఏదైనా కూడా అపారమైన దృడ నిశ్చయంతో ఉండాలి.




.రాజుకు యుద్ధం లో గెలవాలని కోరిక ఉండాలి కాని ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు.
.ఇతరులుకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడతేనే  విజయం సొంతం అవుతుంది.







ఈ మాటలు చెబుతూ ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఎంతో విలువైనవి రావణుడు ఆ సమయంలో చెబుతాడని, అవి లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మనుడిని వెళ్లి తెలుసుకోమని ఉంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుని నలుగురికి తెలియజేద్దాం.

No comments:

Post a Comment