ఫేస్ బుక్ కి మీ గురించి తెలిసిన 98 రహస్యాలు..
ఇది చదివాక మీకు కొంచం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఫేస్ బుక్ వాడటంతో మనం మనకి తెలియకుండానే అవసరానికి మించి మన వ్యక్తిగత విషయాలను బయటపెడుతున్నాం. మీరు కలలో కూడా ఊహించలేనంత మీ గురించి ఫేస్ బుక్ కి తెలుసు అంటే నమ్ముతారా?? నమ్మక తప్పదు మరి....!! మనలో కొంత మందికి తెలిసిన విషయం ఏంటంటే... ఫేస్ బుక్ లో మనం ఏం చూస్తామో దాని బాటే మనకు యాడ్స్ కనిపిస్తాయని. దీని అడ్వటైజింగ్ టాక్టిక్స్ అంటాం అని కూడా తెలుసు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే... మనం మన గురించి ఎన్నో విషయాలు ఫేస్ బుక్ కి తెలియజేస్తున్నాం.
ఇప్పుడు మన గురించి ఫేస్ బుక్ కి ఎంత తెలుసో చూద్దాం...!!
1. మీరు ఉండే ప్రదేశం
2. వయసు
3. మీరు ఏ తరానికి చెందిన వాళ్ళో
4. మీరు ఆడవారా లేక మొగవారా
5. మీ మాతృ బాషా మరియు మీకు తెలిసిన ఇతర బాషలు
6. మీ చదువు
7. మీరు ఏ డిగ్రీ లో ప్రాముఖ్యత సాధించారో
8. మీ స్కూల్
9. మీరు ఏ జాతికి చెందిన వారో
10. మీ సంపాదన
11. మీ ఇల్లు, ఎలాంటి ఇల్లు (ఓన్, రెంట్, అపార్ట్మెంట్, జాయింట్ ఫామిలీ)
12. ఒకవేళ సొంత ఇల్లయితే, మీ ఇంటి వాల్యూ
13. మీ ప్రాపర్టీ సైజు
14. మీ ఇంటి సాటిలైట్ ఇమేజ్
15. ఏ సంవత్సరంలో మీ ఇల్లు కట్టబడింది
16. ఇంట్లో ఎంత మంది ఉంటారు
17. రానున్న 30 రోజులో మీ ఇంట్లో ఎవరెవరికి యానివర్సరిలు లేదా బర్త్ డే ఉంది
18. ఇంటి నుంచి దూరంగా ఉంటున్న ఫామిలీ మెంబెర్స్
19. రానున్న 30 రోజులో మీ ఫ్రెండ్స్ లేదా బంధువులలో ఎవరెవరికి యానివర్సరిలు లేదా బర్త్ డే ఉంది
20. ప్రేమలో ఉండి దూరంగా ఉన్నవాళ్ళు
21. కొత్తగా ప్రేమలో పడిన వాళ్ళు
22. కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు
23. కొత్తగా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు
24. కొత్తగా పెళ్ళైన వాళ్ళు
25. కొత్త ఇంట్లోకి దిగిన వాళ్ళు
26. త్వరలో పుటిన రోజు జరుపుకుంటున్న వాళ్ళు
27. మన తల్లితండ్రుల గురించి
28. మనకు కాబోయే బంధువుల గురించి (ఒక వేళ్ళ పెళ్లి చేసుకోబోతుంటే)
29. మన తల్లితండ్రులు ఎక్కడికి చెందిన వాళ్ళు
30. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా రాజకీయాలోకి వేళాబోయే వాళ్ళు
31. సంప్రదాయవాదా లేక ఉదారవాద
32. మీ రిలేషన్-షిప్ స్టేటస్.. సింగల్, ఎంగేజ్డ్, మ్యారీడ్, విడో, డివోర్స్డ్
33. ఏ కంపెనీకి పని చేస్తున్నారు
34. ఏ ఇండస్ట్రీ కిందకు వస్తారు (న్యూస్, ఐటీ, మార్కెటింగ్)
35. కంపెనీలో మీ హోదా
36. మీ ఆఫీస్ టైపు
37. మీకు ఇష్టమైన టైంపాస్
38. బైక్ లేదా కారు ఉన్న వాళ్ళు
39. త్వరలో బైక్ లేదా కారు కొనబోతున వాళ్ళు
40. ఈ మధ్య కారుకి కావాల్సిన వస్తువులు కొన వాళ్ళు
41. మీరు నడుపుతున్న కారు పేరు.. దాని మోడల్
42. కారు సర్వీసింగ్ మరియు పార్ట్స్ కావలిసిన వారు
43. ఏ సంవత్సరంలో వాహనం కొనుగోలు చేశారు.
44. వాహనం కొని ఎన్ని సంవత్సరాలు గడిచాయి.
45. మీరు కొనబోయే తర్వాత కారు మీద ఎంత ఖర్చు పెడతారు
46. మీ నెక్స్ట్ కారు ఎక్కడ కొనబోతున్నారు
47. మీ కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు
48. మీ బిజినెస్ చేస్తున్న డీటెయిల్స్
49. మానేజ్మెంట్ హోదాలో ఉన్నారా లేక ఎగ్జిక్యూటివ్ లాగా పని చేస్తున్నారా
50. చారిటీ చేస్తున్నారా లేదా
51. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారు
52. బ్రౌసర్ గేమ్స్ ఆడుతున్నారా లేదా
53. సొంత గేమింగ్ కన్సోల్ ఉందా లేదా
54. ఫేస్ బుక్ లో ఏదైనా ఈవెంట్ క్రియేట్ చేసారా లేదా
55. ఫేస్ బుక్ కి ఏమైనా ప్రెమెంట్స్ చేసారా లేదా
56. ఒక వేళ్ళ చేస్తే ఫేస్ బుక్ మీద యెంత ఖర్చు పెట్టారు
57. అడ్మిన్ లా ఎన్ని ఫేస్ బుక్ పేజెస్ మెయిన్-టైన్ చేస్తున్నారు
58. రీసెంట్ గా మీరు ఫొటోస్ అప్లోడ్ చేసారా లేదా
59. మీరు వాడుతున్న ఇంటర్నెట్ బ్రౌసర్
60. మీరు వాడుతున్న ఈమెయిల్
61. మీరు కొత్తగా వస్తున్న టెక్నాలజీ ని త్వరగా వడతారా లేక లేటుగా వడతారా
62. మీరు నిర్వాసితులులా కదా (మీరు ఏ దేశం వదిలి ఇంకో దేశం లో నివసిస్తున్నారు)
63. బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులు
64. మీరు ఇన్వెస్టర్ గా ఉన్నారా లేదా
65. మీకు ఉన్న లోన్ డీటెయిల్స్
66. క్రెడిట్ కార్డు ఉందా లేదా
67. మీరు ఏ క్రెడిట్ కార్డు వాడుతున్నారు
68. డెబిట్ కార్డు ఉందా లేదా
69. మీరు క్రెడిట్ కార్డు లో బాలన్స్ ఉంచుతారా లేదా
70. మీరు రేడియో వింటారా లేదా
71. మీకు నచ్చే టీవీ షోస్
72. మొబైల్ లో ఇంటర్నెట్ వాడే వాళ్ళు
73. మీరు వాడే ఇంటర్నెట్ కనెక్షన్
74. రీసెంట్ గా మీరు కొన స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ వివరాలు
75. స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ఇంటర్నెట్ వాడే వాళ్ళు
76. ఆన్-లైన్ డిస్కౌంట్ కూపన్స్ వాడే వాళ్ళు
77. మీరు ఏ రకం బాటలు కొంటారు
78. మీరు ఒక సంవత్సరంలో ఏ టైములో ఎక్కువ షాపింగ్ చేస్తారు
79. మందు (బీర్, విస్కీ లాంటివి) ఎక్కువగా కొంటారా లేదా
80. ఇంటికి కావలసిన సామగ్రి కొంటారా లేదా, ఒక వేళ్ళ కొంటె ఎలాంటివి కొంటారు
81. అందానికి సంబంధించిన వస్తువులు కొనే వాళ్ళు
82. మీరు సొంతంగా మెడిసిన్ వేసుకుంటారా, లేక డాక్టరుని సంప్రదిస్తారా
83. మీరు ఇంటి వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారా లేదా
84. మీరు పిల్లల వస్తువులు, లేదా పెంపుడు జంతువుల మీద ఖర్చు పెడతారా లేదా. ఒక వేళ్ళ పెడితే ఎలాంటి జంతువును పెంచుకుంటున్నారు
85. మీరు మీ ఇంటి సామాన్లకు అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెడ్తున్నారా
86. మీరు ఆన్-లైన్ షాపింగ్ చేస్తారా లేదా
87. మీరు ఎలాంటి రెస్టారెంట్ లో తింటారు
88. మీరు ఎలాంటి స్టోర్స్ లో షాపింగ్ చేస్తారు
89. కంపెనీలు ఇచ్చే ఆన్-లైన్ బీమాలు, లోన్స్, క్రెడిట్ కార్డు ఆఫర్స్ కి స్పందిస్తారా లేదా
90. ఒక ఇంట్లో మీరు ఎన్ని రోజుల నుంచి నివసిస్తున్నారు
91. త్వరలో ఇల్లు మారబోతున్న విషయం
92. స్పెషల్ రోజుల మీద ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు (ఒలింపిక్స్, క్రికెట్, రంజాన్, దీపావళి, క్రిస్మస్)
93. మీరు ఊళ్లు బాగా తిరుగుతారా లేదా, ఒక వేళ్ళ తిరుగుతే... పని మీదా లేక సరదాకా)
94. ప్రయాణం చేసి పనికి వెళ్తున్నారా లేదా
95. మీరు ఏ రకం హాలిడేకి వెళ్తుంటారు
96. మీరు రేసెంటుగా ఏదైనా ట్రిప్ కి వెళ్ళారా లేదా
97. మీరు రేసెంటుగా ఏదైనా ట్రావెల్ యాప్ వాడారా లేదా
98. మీరు ఫేస్ బుక్ లో టైం షేర్ ని వాడారా లేదా, ఒక వేళ్ళ వాడితే ఎన్ని రోజులకు ఒకసారి వాడతారు
ఈ పైన ఉన్న విషయాలు అని మనం మనకు తెలియకుండా ఫేస్ బుక్ కి ఇచ్చేస్తున్నాం. అసలు విషయం ఏంటంటే ఈ వివరాలను ఫేస్ బుక్ వారు తీసుకోకుండా చేయలేము కూడా. ఒకవేళ ఇలా జరగకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది.... ఫేస్ బుక్ ని వాడటం మానేయాలి. ఈ రోజుల్లో అది సాధ్యమంటారా? ఇక ఈ విషయంపై మీకు మీరే ఓ నిర్ణయానికి రండి..!!
దయచేసి ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి..!! ఈ స్మార్ట్ దోపిడీ నుండి ఒక్కరినైనా తప్పిస్త