మీరు ఫోన్ ను ఏ చెవికి పెట్టుకొని మాట్లాడతారు? కుడా? ఎడమా? You can set the phone to speak to any ear? left ?right?
నేడు టెక్నాలజీ ఎంత వేగంగా మార్పులు చెందుతుందో అందరికీ తెలిసిందే.
ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు మనం ఎంతో వేగంగా పనులు
చేసుకోగలుగుతున్నాం. ఒకప్పటి కన్నా ఇప్పుడు పనివేగం ఎంతగానో
పెరిగింది. అయితే మన పనివేగాన్ని పెంచిన ఆధునిక పరికరాల్లో సెల్‌ఫోన్లు
కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్ల వల్ల మనం ఎన్ని రకాల పనులను వేగంగా
చేసుకుంటున్నామో అందరికీ తెలుసు.
కానీ వీటి వల్ల వచ్చే రేడియేషన్
కారణంగా మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా కలుగుతున్నాయి.
ప్రధానంగా సెల్‌ఫోన్ ద్వారా చేసే కాల్స్ వల్ల మన మెదడుకు ఎంతగానో
ఎఫెక్ట్ అవుతోంది. చాలా మంది కుడి లేదా ఎడమ చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని
కాల్స్ మాట్లాడతారు. అయితే నిజానికి కుడి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని
మాట్లాడకూడదట. ఎడమ చెవి దగ్గర మాత్రమే ఫోన్‌ను పెట్టుకుని
మాట్లాడాలట. అది ఎందుకో తెలుసా..?
ఫోన్ మోగిందంటే చాలు వెంటనే తీసి దాన్ని కుడి చెవి దగ్గర పెట్టుకుని
మాట్లాడడం చాలా మందికి అలవాటు. కొందరైతే ఏకంగా చెవిని చెవి కింద
ఆనించుకుని పెట్టి మరీ బైక్‌పై లేదంటే కార్‌లో వెళ్తూ మాట్లాడుతారు కూడా.
కానీ అలా ఫోన్‌ను కుడి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఫోన్ నుంచి
వచ్చే సాధారణ రేడియేషన్ మెదడుపై డైరెక్ట్‌గా ప్రభావం చూపుతుందట.
అంతేకాదు, ఇలా మాట్లాడడం వల్ల కొందరికి చెవులు సరిగ్గా
వినిపించకుండాపోయే ప్రమాదం కూడా ఉంటుందట.
కుడి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడితే ఎలాంటి దుష్పరిణామాలు
కలుగుతాయోనన్న విషయంపై పలువురు సైంటిస్టులు పరిశోధనలు కూడా చేశారు.
20 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న యువతీ యువకులను కొందరిని ఎంపిక
చేసుకుని వారిపై కొందరు సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో వారికి
తెలిసిందేమిటంటే కుడి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడేవారి ఆరోగ్యం,
ఇతరులతో పోలిస్తే బాగా క్షీణించిందని తెలిసింది.
అదే సమయంలో ఎడమ చెవి
దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడే వారిని కూడా పరిశీలించగా వారి ఆరోగ్యం
కొద్దిగా క్షీణించింది కానీ, కుడి చెవి వారితో పోలిస్తే అది తక్కువేనని
తెలిసింది. కనుక ఫోన్‌ను మాట్లాడాలంటే ఎక్కువగా ఎడమ చెవినే ఉపయోగించడం
శ్రేయస్కరం. అదీ హెడ్‌ఫోన్స్ వంటి వాటిని వాడితే ఇంకా మంచిది. కానీ అవి
బ్లూటూత్‌వి అయి ఉండకూడదు. నార్మల్‌వి అయి ఉండాలి. అయితే ఎడమ చెవి
దగ్గర ఫోన్‌ను పెట్టుకుని మాట్లాడినా చెవికి కొంత దూరంగా ఫోన్‌ను ఉంచి
మాట్లాడితే దాంతో ఎఫెక్ట్ ఇంకా తక్కువగా ఉంటుందని సదరు సైంటిస్టులు
చెబుతున్నారు. కనుక మీరు కూడా ఫోన్ మాట్లాడితే పైన చెప్పిన విధంగా
చేయండి..! ఎంతైనా మన ఆరోగ్యం ముఖ్యం కదా..!
No comments:
Post a Comment