Translate

Thursday, 1 December 2016

లెక్కకు మించిన బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్క చెప్పాలంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండాలి అనే దానిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి. సొంతంగా సంపాదించిన డబ్బుతో బంగారం కొంటే ఇబ్బందిలేదన్నారు. పన్ను మినహాయింపు పొందిన డబ్బుతో కొనుగోలు చేసినా సమస్యలు ఉండవన్నారు. ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే తప్పులేదని వివరణ ఇచ్చారు. వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.

బంగారంపై మరిన్ని వివరాలు :

… వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. సీజ్ చేయం
… ఒక్కో వివాహిత మహిళ 500 గ్రాముల (అరకిలో) బంగారం ధరించవచ్చు
… వివాహం కాని మహిళ 250 గ్రాముల బంగారు ఆభరణాలు ధరించవచ్చు
… మగాళ్ల దగ్గర 100 గ్రాముల బంగారానికి మించి ఉండరాదు
… మహిళలు, పురుషుల దగ్గర ఉండాల్సిన బంగారం కంటే అధికంగా అంటే.. అది లెక్కల్లో చూపిన డబ్బుతో కొనుగోలు చేసినది అయితే మాత్రమే చర్యలు ఉంటాయి.
… లెక్కల్లో చూపిన డబ్బుతో కొనుగోలు చేసిన బంగారాన్ని సీజ్ చెయ్యం
… పన్ను మినహాయింపు పొందిన ఆదాయంతో బంగారం కొనుగోలు చేసినా ఇబ్బందులు ఉండవు
… లెక్కల్లో చూపని ఆదాయంతో బంగారం కొనుగోలు చేస్తే ట్యాక్స్ వేస్తారు.
… స్త్రీధనంగా వచ్చిన బంగారంపై ఆంక్షలు ఉండవు
… లెక్కచూపని బంగారంపై భారీగా పన్ను ఉంటుంది
… రద్దయిన పెద్ద నోట్లతో బంగారం కొని.. నిల్వ చేసుకునే వారి కుట్రలు భగ్నం చేస్తాం.


No comments:

Post a Comment