బీచ్‌కెళ్లి తెగ ఆలోచించి స్క్రిప్ట్ రాసే పన్లేదు... లొకేషన్లు... షూటింగ్ హైరానా అసలేం అక్కర్లేదు... తీసిన బొమ్మని జనాల చెంతకు చేర్చేదెలా అనే చింతే వద్దు... నిత్య జీవితంలోని సన్నివేశాలనే యువతకు నచ్చే సీన్లుగా మార్చితే చాలు... కాస్త టాలెంట్‌కు తోడు బాగా చేయాలన్న కసి ఉంటే ప్లస్‌పాయింట్... వరుసపెట్టి ఎపిసోడ్లు తీసి యూట్యూబ్‌లో వదిలితే సరి! పేరు, డబ్బుతోపాటు కాలం కలిసొస్తే సినిమా అవకాశాలూ పలకరిస్తాయ్... అండదండలందించడానికి ఇన్‌హౌస్‌లు ఉన్నాయి... వెబిసోడ్ బాగుంటే ఫేస్‌బుక్‌లు.. వాట్సాప్‌లే పీఆర్‌వోలవుతాయి... ఈ కిటుకు తెలిసిన సినీప్రియులు చేస్తోందదే... అందుకే ఈ వెబ్‌సిరీస్‌లు జోరు మీదున్నాయి... ఆ వివరాలు.. ఈ ట్రెండ్‌తో స్టార్లుగా మారిన కొందరి పరిచయం.
టాప్‌లో కొన్ని
* ఫన్‌బకెట్
* పోష్ పోరీస్
* ఫ్రస్ట్రేటెడ్ వుమన్
* కితకితలు
* స్టేజెస్ ఆఫ్ లవ్
* కంత్రీ గాయ్స్
* చికాగో సుబ్బారావు
* కితకితలు
* దెయ్యం ప్రేమలో పడింది
* ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ
* మహాతల్లి (వీటిని యూట్యూబర్ అనాలంటోంది జాహ్నవి).
మాది గుంటూరు. మొదట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అదే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. గాడ్‌ఫాదర్లెవరూ లేరు. సుజిత్‌సైన్ స్ఫూర్తితో లఘుచిత్రాలు తీసి సినిమా ఛాన్స్ కొట్టేయాలనుకున్నా. ‘లైలా మజ్నూ’ తీసి యూట్యూబ్‌లో పెట్టా. ఒక్కరోజులోనే పదివేల వ్యూస్ వచ్చాయి. ఆ ఉత్సాహంతో మరో ఐదారు వదిలా. ‘రన్ రాజా రన్’కి రమ్మంటూ పిలుపందింది. ఆ సినిమాకి అసిస్టెంట్‌గా చేశాక తెలుగువన్‌లో చేరా. మహేశ్, త్రిశూల్‌లు పరిచయమయ్యారు. జనం వాడుకలో ఉన్న జోక్స్‌కి మెరుగులద్ది ఓ వెబ్‌సిరీస్ ప్రారంభిద్దామని ఎండీగారికి చెప్పి ఒప్పించా. రెండ్రోజుల్లోనే రెండు ఎపిసోడ్‌లు చేశాం. పెద్దగా స్పందన రాలేదు. సొంతపనిమీద వూరెళ్లినపుడు ‘నీ వీడియోలు ఆన్‌లైన్‌లో బాగా సందడి చేస్తున్నాయి. జనాల్ని తెగ నవ్విస్తున్నాయి’ అన్నారు ఫ్రెండ్స్. యూట్యూబ్ చూస్తే రెండు, మూడువేల క్లిక్స్ ఉన్నవి ఇరవై, ముప్ఫైవేలకు పెరిగాయి. ఇంక సీరియస్‌గా ప్రయత్నించాలని అందరం డిసైడయ్యాం. మహేశ్ మళ్లీ వూరెళ్లి రాయలసీమ యాసకు ఇంకాస్త పదును పెట్టుకొని వచ్చాడు. సీన్ బాగా పండాలని ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాం. అందుకే ప్రతి ఎపిసోడ్ సూపర్‌హిట్ అవుతూ 61వ సిరీస్‌కి చేరాం. - హర్ష అన్నవరపు, ఫన్‌బకెట్ డైరెక్టర్
స్వానుభవాలే కథలు
షార్ట్‌ఫిల్మ్ తీయాలనే కల ఉన్నవాళ్లకి ఇప్పుడు వనరులు, అవకాశాలు ఎక్కువ. అన్నిరకాలుగా సాయం అందించే ఇన్‌హౌస్‌లు ఉన్నాయి. మనసు పెట్టి మన సత్తా నిరూపించుకుంటే చాలు. నిత్య జీవితంలో జరిగే చిన్నచిన్న సంఘటనలతోనే ఈ వెబిసోడ్‌లు రూపొందించవచ్చు. అద్దెగది కోసం పడ్డ పాట్లు, ఔటర్‌రింగ్ రోడ్డుమీద తప్పిపోవడం.. ఇంట్లో పెళ్లి చేసుకొమ్మని గొడవ.. ఇలాంటి స్వానుభవాలతోనే మహాతల్లి సిరీస్‌లు రూపొందిస్తున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఇంగ్లిష్‌లో బాగా పాపులరైన ‘సూపర్‌వుమన్’ నాకు స్ఫూర్తి. మన ఆలోచనలు పంచుకోవడానికి, సపోర్టింగ్ పాత్రలు వేయడానికి సహోద్యోగులుంటారు. కథలో కొత్తదనం, ఫన్‌కి ప్రాధాన్యం ఇస్తూ హావభావాలు బాగా పలికించగలిగితే ప్రతి ఎపిసోడ్‌ని హిట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. - జాహ్నవి దాశెట్టి, మహాతల్లి
అందరికీ నచ్చేవే
యువతని నవ్వించే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌లు మొదలైనా అన్ని వయసుల వారూ ఇష్టపడుతున్నారు. నిడివి తక్కువగా ఉండటం.. సాగతీత లేకుండా విషయం సూటిగా చెప్పడం.. హాస్యంపాళ్లు ఎక్కువగా ఉండటం విజయానికి కారణాలు. ఎక్కువమందికి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండటం.. క్షణాల్లో ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పంపుకునే వీలుండటం కూడా కలిసొస్తోంది. షార్ట్‌ఫిల్మ్స్‌తో పోలిస్తే వెబ్‌సిరీస్‌కి పనిచేసేవాళ్లకు దక్కే గుర్తింపు, సంపాదనా ఎక్కువే. యూట్యూబ్‌లో మళ్లీమళ్లీ కనపడటంతో బాగా పేరొచ్చి జనాలు గుర్తుపడుతున్నారు. వ్యూస్, యాడ్స్ ఎక్కువైతే సహజంగానే అందరికీ సంపాదన పెరుగుతుంది. ఒక్క తెలుగువన్ నుంచే ప్రస్తుతం పది వెబ్‌సిరీస్‌లు వస్తున్నాయి.
ఫన్‌బకెట్.. మహాతల్లి.. పోష్ పోరీస్.. ఈ పేర్లు తెలియని వారెవరైనా ఉంటారా? స్మార్ట్‌ఫోన్లో ఈ వీడియోలు వీక్షిస్తూ... వాట్సాప్‌లో షేర్ చేస్తూ నవ్వుల్లో తేలిపోయేవాళ్లు ఎక్కువే. మన లైఫ్‌లో జరిగే సంఘటనలనే కామెడీగా మార్చేస్తూ అర్రె... భలే బాగుందే అనిపిస్తూ యువతకి తెగ నచ్చేస్తున్నాయి ఈ వెబ్‌సిరీస్‌లు.
జోరు మీదున్న ట్రెండ్
వెబ్‌సిరీస్ మరీ కొత్త ట్రెండేం కాదు. జోరందుకుంది మాత్రం ఇప్పుడే. పర్మనెంట్ రూమ్మేట్స్, లవ్ బైట్స్, గర్ల్ ఇన్ ద సిటీ, ఐషా... అంటూ ఉత్తరాదిని ఎప్పుడో వూపేశాయివి. మన దగ్గర ఈ హల్‌చల్ మొదలైంది మాత్రం ఏడాది కిందటే. ముద్దపప్పు ఆవకాయ ఈ ధోరణికి శ్రీకారం చుట్టిందని చాలామంది చెబుతుంటే ‘అబ్బే మా ఫన్‌బకెట్‌నే ముందుంది’ అంటాడు డైరెక్టర్ హర్ష. ఇంతకు ఇందులో కొత్తదనం ఏంటి? అంటే స్టార్ తారాగణం... భారీ లొకేషన్లు... పెద్ద నిడివి... చెవులు చిల్లులు పడే సంగీతం... అస్సలుండవు. సినిమా హిట్ సన్నివేశాలకు పేరడీలు, నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే చిన్నచిన్న కష్టాలు, యూత్ జీవితానికి అద్దం పట్టే సీన్లు, నవ్విస్తూనే అప్పుడప్పుడు ఏడిపించే సన్నివేశాలు, అన్నింటికి మించి వీక్షకుల పెదాలపై దరహాసం చిందేలా... వికటాట్టహాసం చేయించేలా వండి వార్చిన కథలే నడిపిస్తాయి.

అందుకే విజయం
ఏడాది కిందట వెబ్‌సిరీస్‌లు ఒకట్రెండే ఉండేవి. ఇప్పుడు సంఖ్య అర్ధశతకం దాటింది. నటన, దర్శకత్వం, సంగీతం, మరోటి... ఇరవై నాలుగు కళల్లో ఎందులో దూసుకెళ్లాలనుకున్నా ఔత్సాహికులు చూస్తోంది ఇటువైపే. కథ, కాన్సెప్టు సిద్ధంగా ఉంటే చాలు... కాస్టింగ్, సరంజామ, లొకేషన్లు వెతికిపెట్టే ఇన్‌హౌస్‌లు అందుబాటులో ఉండనే ఉన్నాయి. ఐదారు గంటల షూటింగ్‌తో ఓ వెబ్‌సోడ్ సిద్ధమైపోతుంది. నెటిజన్లను నవ్వించగలిగితే యూట్యూబ్‌లో వదిలిన ఒకరోజులోపే మినిమమ్ లక్ష క్లిక్‌లు గ్యారెంటీ. ఫన్‌బకెట్, మహాతల్లి సిరీస్‌లు మొదలైనప్పుడైతే ఆఫీసునే లొకేషన్‌గా మార్చేసి నాలుగైదు గంటల్లోనే షూటింగ్ పూర్తి చేసేశారు.

అండగా ఇన్‌హౌస్‌లు
‘ఒక్క ఛాన్స్’ అంటూ ఆశపడే సినీప్రియులకు వెబ్‌సిరీస్‌లు ఇప్పుడు రసగుల్లాల్లా మారాయి. వాళ్లలో టాలెంట్ ఉంటే చాలు నటులు, సాంకేతికవర్గం, పెట్టుబడితో సహా అన్నీ సమకూర్చి పెట్టే ఇన్‌హౌస్‌లు ఇప్పుడు ఇరవైకి పైనే ఉన్నాయి. తమాడా మీడియా, తెలుగువన్, ఖేల్‌పీడియా, ఐక్లిక్, ఐ డ్రీమ్... వాటిలో కొన్ని. ప్రతిభ ఉంటే నిరూపించుకున్నోళ్లకు నిరూపించుకున్నంత. మొదటి అడుగే హిట్ అయితే అడ్డుండదు. తప్పటడుగైనా భయపడకుండా తర్వాత ఎపిసోడ్‌కి కసిగా ప్రయత్నించొచ్చు. ఫన్‌బకెట్ స్టార్ డైరెక్టర్ హర్ష మొదట్లో ఇలా వైఫల్యాలు ఎదుర్కొన్నవాడే. ఇక సరుకున్న వాళ్లని కొన్ని ఇన్‌హౌస్‌లు ఉద్యోగులుగానే నియమించుకుంటున్నాయి. జీతాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కార్పొరేట్ ఉద్యోగులు కుళ్లుకునేంత. అలా నచ్చకపోయినా వెబిసోడ్‌కి ఇంతని జీతం మాట్లాడేసుకోవచ్చు. ఒక్క ఎపిసోడ్‌కి రూ.వెయ్యి నుంచి పదివేల దాకా పుచ్చుకునేవాళ్లున్నారు.

సెలెబ్రెటీ హోదా
ఆదాయం... ఆశ నెరవేరడమే కాదు వెబ్‌సిరీస్‌లతో సెలెబ్రెటీ హోదా దక్కుతుంది. ఫన్‌బకెట్ బ్యాచ్ ఓ పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతుంటే రైళ్లొ అభిమానులంతా చుట్టేసి రచ్చరచ్చ చేసేశారు. మహాతల్లి జాహ్నవి ఎక్కడ కనపడ్డా ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలంటూ కనీసం పదిమందైనా ఎగబడతారు. తనిపుడు బాగా పాపులర్ కావడంతో పెద్దపెద్ద హీరోలు సైతం ఆమె వెబిసోడ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అన్నట్టు ఈ ఫేమ్ సినిమాలకూ నిచ్చెనగా ఉపయోగపడుతోంది. రాయలసీమ మాండలికంతో పాపులరైన మహేశ్ ఇప్పటికే ఐదారు సినిమాలకు సంతకం చేసేశాడు. త్రిశూల్, రాజేశ్ ఉల్లిలను సైతం అవకాశాలు పలకరించాయి. చెప్పుకుంటూ పోతే వెబ్‌సిరీస్‌లు తెలుగు జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతూ సృష్టికర్తలకు పేరు, కాసులు కురిపిస్తున్నాయి.
ఆదాయం... ఆశ నెరవేరడమే కాదు వెబ్‌సిరీస్‌లతో సెలెబ్రెటీ హోదా దక్కుతుంది. ఫన్‌బకెట్ బ్యాచ్ ఓ పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతుంటే రైళ్లొ అభిమానులంతా చుట్టేసి రచ్చరచ్చ చేసేశారు. మహాతల్లి జాహ్నవి ఎక్కడ కనపడ్డా ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలంటూ కనీసం పదిమందైనా ఎగబడతారు. తనిపుడు బాగా పాపులర్ కావడంతో పెద్దపెద్ద హీరోలు సైతం ఆమె వెబిసోడ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అన్నట్టు ఈ ఫేమ్ సినిమాలకూ నిచ్చెనగా ఉపయోగపడుతోంది. రాయలసీమ మాండలికంతో పాపులరైన మహేశ్ ఇప్పటికే ఐదారు సినిమాలకు సంతకం చేసేశాడు. త్రిశూల్, రాజేశ్ ఉల్లిలను సైతం అవకాశాలు పలకరించాయి. చెప్పుకుంటూ పోతే వెబ్‌సిరీస్‌లు తెలుగు జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతూ సృష్టికర్తలకు పేరు, కాసులు కురిపిస్తున్నాయి.
* పోష్ పోరీస్
* ఫ్రస్ట్రేటెడ్ వుమన్
* కితకితలు
* స్టేజెస్ ఆఫ్ లవ్
* కంత్రీ గాయ్స్
* చికాగో సుబ్బారావు
* కితకితలు
* దెయ్యం ప్రేమలో పడింది
* ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ
* మహాతల్లి (వీటిని యూట్యూబర్ అనాలంటోంది జాహ్నవి).
మాది గుంటూరు. మొదట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అదే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. గాడ్‌ఫాదర్లెవరూ లేరు. సుజిత్‌సైన్ స్ఫూర్తితో లఘుచిత్రాలు తీసి సినిమా ఛాన్స్ కొట్టేయాలనుకున్నా. ‘లైలా మజ్నూ’ తీసి యూట్యూబ్‌లో పెట్టా. ఒక్కరోజులోనే పదివేల వ్యూస్ వచ్చాయి. ఆ ఉత్సాహంతో మరో ఐదారు వదిలా. ‘రన్ రాజా రన్’కి రమ్మంటూ పిలుపందింది. ఆ సినిమాకి అసిస్టెంట్‌గా చేశాక తెలుగువన్‌లో చేరా. మహేశ్, త్రిశూల్‌లు పరిచయమయ్యారు. జనం వాడుకలో ఉన్న జోక్స్‌కి మెరుగులద్ది ఓ వెబ్‌సిరీస్ ప్రారంభిద్దామని ఎండీగారికి చెప్పి ఒప్పించా. రెండ్రోజుల్లోనే రెండు ఎపిసోడ్‌లు చేశాం. పెద్దగా స్పందన రాలేదు. సొంతపనిమీద వూరెళ్లినపుడు ‘నీ వీడియోలు ఆన్‌లైన్‌లో బాగా సందడి చేస్తున్నాయి. జనాల్ని తెగ నవ్విస్తున్నాయి’ అన్నారు ఫ్రెండ్స్. యూట్యూబ్ చూస్తే రెండు, మూడువేల క్లిక్స్ ఉన్నవి ఇరవై, ముప్ఫైవేలకు పెరిగాయి. ఇంక సీరియస్‌గా ప్రయత్నించాలని అందరం డిసైడయ్యాం. మహేశ్ మళ్లీ వూరెళ్లి రాయలసీమ యాసకు ఇంకాస్త పదును పెట్టుకొని వచ్చాడు. సీన్ బాగా పండాలని ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాం. అందుకే ప్రతి ఎపిసోడ్ సూపర్‌హిట్ అవుతూ 61వ సిరీస్‌కి చేరాం. - హర్ష అన్నవరపు, ఫన్‌బకెట్ డైరెక్టర్
No comments:
Post a Comment