లక్మీ
వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లోని పూజ గదిలో కానీ గదిలో ఒక మూల గానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఈ
మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు,
అక్షతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో
మండపంలో ఉంచాలి.
కావలసిన వస్తువులు
పసుపు, కుంకుమ, ఎర్రటి జాకెట్టు బట్ట, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరానికి అవసరమైన దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, శనగలు.
తోరం ఇలా తయారు చేసుకోవాలి
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించాలి. ఈ విధంగా తోరాలను పూజించిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి.
వరలక్ష్మీ వ్రత కథ
ఇది తరతరాలనుంచి భారతీయ సంప్రదాయంలో కలిసిపోయిన వరలక్ష్మీ వ్రత కథ. స్ర్తీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని గురించి కైలాసంలో శివుడు పార్వతికి చెప్పాడు. భగవత్ సమానులైన ఋషుల ద్వారా ఈ కథ భూలోక వాసులకు తెలిసింది. నాటినుంచి ఏటా కోట్లాది మంది ముత్తైదువులు శ్రావణ శుక్రవారం నోము నోచిన రోజు వరలక్ష్మీ వ్రత కథను పారాయణం చేస్తున్నారు. ఈ కథను శౌనకాది మహామునులకు సూతపౌరాణికుడు చెప్పాడు.
‘‘స్ర్తీలకు వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి’’ అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. పార్వతీ దేవికి వరలక్ష్మీ వ్రతం గురించి ఇలా చెప్పాడు. ‘‘ఓ పార్వతీ, వరలక్ష్మీ కథను చెబుతున్నాను. శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్ర్తీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతి రోజూ తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్త మామలను సేవిస్తూ, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒక రోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి ‘‘నేనమ్మా.. వరలక్ష్మీదేవిని. నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను’’ అని చె ప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి –
‘‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే
శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే
ఓ జగన్మాతా! నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు. విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది’’ అంది కలలోనే. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విష యాలను అత్తమామలకును, ఇరుగుపొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మీ వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది.
చారుమతి చెప్పినప్పటి నుంచి స్ర్తీలు శ్రావణమాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్ర వారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజగదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేశారు.
ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్ర్తీలతో కలసి ‘‘పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవసర్వదా’’ అని ధ్యానించి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది. పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది.
ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తికాగానే ఆ స్ర్తీలందరి కాళ్లలో ఘల్లు ఘల్లుమనే శబ్దం వినిపించింది. ఆ స్ర్తీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్లవైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి, మిగిలిన స్ర్తీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారు మతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తురగ వాహనాలతో, సౌభా గ్యంతో నిండిపోయింది.
వ్రతంలో పాల్గొన్న స్ర్తీలను తీసుకుపోవటానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటివద్ద నిలిచాయి. తమచేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధం, పుష్పాలతో పూజించారు. దక్షిణ, తాంబూలము, పన్నెండు భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధువులతో కలసి భుజించాక వాహనాలలో స్ర్తీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
ఆ రోజునుంచి చారుమతితో పాటు పలువురు స్ర్తీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ, సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారూ చేయవచ్చు. ఈ కథను విన్నవారికీ, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్య దాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది.’’ అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు.
ఈ కథ అనంతరం అక్షతలు శిరస్సున ధరించి, పసుపు కుంకుమలను గడప మధ్యలో పెట్టాలి

No comments:
Post a Comment