అడవిలోనుంచి వచ్చిన రెండు ఏనుగులు
ప్రమాదవశాత్తు ఓ గ్రామ బావిలో పడటంతో వాటి కోసం 120 ఏనుగుల మంద గ్రామంపై
దాడికి వచ్చిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో
జరిగింది.
పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలోని ఓ బావిలో రాత్రి 8
గంటలవేళ రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. ఈ విషయం గ్రహించిన 120
ఏనుగులు ఏనుగులు పడిన బావి వద్దకు గుంపుగా తరలివచ్చి రక్షణ వలయంగా
నిల్చున్నాయి.
ఇంతలో ఏనుగుల మందలో ఉన్న ఓ ఏనుగు ప్రసవించింది. దీంతో బావిలో
పడిన రెండు ఏనుగులను వెలికితీయలేక పోయామని డివిజనల్ అటవీశాఖాధికారి
రబీంద్రనాథ్ సహ చెప్పారు. అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి
చేసిందన్న వార్తలతో పరిసర అటవీ గ్రామాల ప్రజలు తమ ఇళ్లు వదిలి ఇతర
ప్రాంతాలకు వలసవెళుతున్నారు.
ఏనుగుల మంద గ్రామాలపై దాడి చేయకుండా ఉండేలా
తాము గ్రామస్థులకు ప్లేమింగ్ టార్చులను ఇచ్చామని అటవీశాఖాధికారులు
చెప్పారు. మొత్తంమీద ఏనుగుల గుంపు బావి చుట్టూ బైఠాయించడంతో
అటవీశాఖాధికారులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
No comments:
Post a Comment