మన దేశంలోని పలు ప్రాంతాల్లో అర్జున
వృక్షం బాగా పెరుగుతుంది. దీన్ని కలపగా ఉపయోగిస్తారు. ఈ వృక్షాన్ని
తెల్లమద్ది అని కూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ
వాడుతున్నారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అయితే ఈ
వృక్షానికి గుండె జబ్బులు, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేసే శక్తి
ఉంది. అంతేకాదు విరిగిన ఎముకలను కూడా త్వరగా అతుక్కునేలా చేసే గుణాలు
ఇందులో ఉన్నాయి. ఈ చెట్టు బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం
అధికంగా ఉంటాయి. దీంతో ఆ బెరడు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అర్జున చెట్టు బెరడుని పాలలో కాచి
వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగుతుంటే గుండె జబ్బులు
దూరమవుతాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె కు
రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది.
2. ఈ చెట్టు బెరడును బాగా మెత్తగా నూరి
చూర్ణంగా చేసి పాయసంలో 10 గ్రాముల మోతాదులో కలిపి తింటుంటే దాంతో శ్వాస
కోశ సమస్యలు తొలగిపోతాయి. ప్రధానంగా ఆస్తమా ఉన్న వారికి ఇది ఎంతగానో
మేలు చేస్తుంది.
3. అర్జున చెట్టు బెరడు నుంచి తయారు చేసిన
చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చాలా
ప్రముఖమైన ఆయుర్వేద మందుల్లో ఈ కాంబినేషన్‌ను ఎక్కువగా వాడుతారు.
కాల్షియం బాగా ఉండడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అంతేకాదు, అవి
బలంగా కూడా మారుతాయి.
4. ఈ చెట్టు బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖానికి రాసుకుంటే దాంతో మొటిమలు తగ్గుతాయి.
5. అర్జున చెట్టు బెరడు కషాయాన్ని తాగితే కాలిన గాయాలు, పుండ్లు తగ్గుతాయి.
6. అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
7. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది.
No comments:
Post a Comment