Translate

Friday, 2 December 2016

ఆయుధపూజ  దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.ఆంధ్రుల కనకదుర్గ...తెలంగాణ ‘బతుకమ్మ’...కన్నడిగుల చాముండి... ఇలా ప్రాంతాలు వేరయినా..విశ్వవ్యాప్తంగా ఎవరు ఏ పేరున పిలచినా...కొలిచినా విజయదశమి పర్వదినాలలో దేవి తన భక్తులను అనుగ్రహించి



... ఎవరైతే త్రికరణశుద్థిగా, సత్సంకల్పసిద్ధితో కార్యక్రమాన్ని తలపెడతారో వారి మనోసంకల్పాన్ని జయప్రదంచేసి అష్టైశ్వర్యములుప్రసాదించే భాగ్యప్రధాయని. అందుకే అంబిక,దుర్గ,భవాని..ఇత్యాది ఏ పేరున పిలచినా పలికే అమ్మలగన్న అమ్మగా...ముజ్జగాలకే మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విజయానికి ప్రతీకగా..చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా సదా ఈ పర్వదినాన్ని ప్రజలంతా జరుపుకుంటారు.అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట padakundaa శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు.









 అజ్ఞాతవాస ముగింపులో విజయదశమినాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు
 కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు.
 ఇదే ఆయుధ పూజ. విద్యార్ధులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమవృత్తికి సంబంధించిన పుస్తకాలను పూలలో పెట్టడం ఆనవాయితీ.
 ఈ రోజు నూతనంగా విద్యార్ధులు పాఠశాలలో ప్రవేశింప చేయడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.

No comments:

Post a Comment