Translate

Friday, 2 December 2016

తలస్నానం ఏ రోజుల్లో చేయాలి.?सिर स्नानकिसी भी दिन सिर स्नान करना चाहिए?

ఈ రోజుల్లో మహిళలు తరచుగా తలస్నానం చేస్తుంటారు. ఉద్యోగం చేసే మహిళలు బయట దుమ్ము, ధూళి పడుతుందని..ఇంట్లో ఉండే గృహిణులు ప్రతి రోజూ ఒక్కో దేవుడికి పూజలు చేయాలంటూ తరచుగా తల స్నానం చేస్తుంటారు.అలా ప్రతి రోజూ తలస్నానం చేయడం శాస్త్ర ప్రకారం తప్పు అని పండితులు చెబుతున్నారు.ఒక్క మహిళలకే కాదు..ప్రతి ఒక్కరికి కొన్ని రోజులు తలస్నానం నిషిద్ధం అని చెబుతున్నారు..ముఖ్యంగా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది.సోమవారం చేస్తే తాపాన్ని ఇస్తుంది కాబట్టి చేయకపోవడమే మంచిది.బుధవారం నాడు మాత్రం తలస్నానం చేయవచ్చు ఇక గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం చాలా తప్పు అని శాస్త్రం చెబుతుంది.శని, ఆదివారాల్లో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి దోషం లేదు..ముఖ్యంగా స్త్రీలు ప్రతి శుక్రవారం విధిగా తలస్నానం
చేయాలి.






ఆ రోజు పసుపు తమ మంగళసూత్రానికి రాసుకోవాలి. ముఖానికి కూడా పసుపు రాసుకోవాలి. పురుషులకి మాత్రం శుక్రవారం నాడు తలస్నానం చేయడం నిషిద్ధం..శనివారం, ఆదివారం, బుధవారం మాత్రమే తలంటు పోసుకోవాలి..కానీ పండుగ దినాల్లో వారం ఏది వచ్చినా విధిగా తలస్నానం చేయాల్పిందే. అది తప్పు కాదు..ఏది ఏమైనా స్త్రీలు మాత్రం శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే చక్కగా అభ్యంగన స్నానం చేసి, నుదుటన, పాపిడిలో నిండైనా బొట్టును పెట్టుకుని ధూప, దీప నైవేద్యాలతో ఇష్టదేవతా పూజ చేస్తే.. ప్రతి స్త్రీ ఇంటికి ఇల్లాలే దీపంలాగా కలకాలం వెలుగొందుతుందని పండితులు చెబుతున్నారు. మొత్తంగా స్త్రీలు బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే తలస్నానం చేస్తే అన్ని విధాల శ్రేయస్కరమని శాస్త్రం చెబుతుంది…

No comments:

Post a Comment