Translate

Friday, 2 December 2016

భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి తిథిని బట్టి పుట్టినరోజు చేసుకోవాలి.

పుట్టిన రోజు అనగానే అందరూ పుట్టిన తేదిని బట్టి పుట్టినరోజు చేసుకుంటారు. ఆంగ్ల తేదీని బట్టి పుట్టిన రోజు చేసుకోవడం మన శాస్త్రం ప్రకారం సరైన పని కాదు. భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి తిథిని బట్టి పుట్టినరోజు చేసుకోవాలి. పుట్టినప్పుడు ఏమాసం తిథి ఉందొ చూసుకుని ఆ ప్రకారం జరుపుకోవాలి.
పుట్టినరోజునాడు ఉదయమే లేచి స్నానం చేసి, తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుని, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అక్కడ దేవుడితో పాటు నిత్యం ఆ స్వామి సేవలో ఉన్న ఆలయ పూజారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆయుశ్సూక్తం అనే సూక్తాన్ని చెప్పాలి, లేదా బ్రాహ్మనోత్తముడి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకా చేయగలిగితే ఆయుశ్సు హోమం చేయించుకోవచ్చు.




ఇక పార్టీలు అంటూ కేకు కట్ చేయడంతో పాటు దీపం ఆర్పుతారు. మన సాంప్రదాయం దీపం వెలిగించడమే కాని దీపం ఆపడం అంటే అశుభం. దీపం ఆపకూడదు..ఇది మన ఆచారం కాదు. ఎవరినైనా మంచివాడు కాదు అనాలంటే అమ్మో వాడా దీపాలు ఆర్పే రకం అని అంటారు. దానిని బట్టి అర్ధం చేసుకోండి దీపం ఆపడం ఎంత తప్పో.
పుట్టినరోజునాడు ఉన్నవాడిని పిలిచి, దీపాలు ఆపడంలాంటి  వేడుక కంటే ఆరోజు దానం చెయ్యాలి. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టండి. ఒంటి మీద కప్పుకోవడానికి వస్త్రం దానం చెయ్యండి. ఇలాంటి దానధర్మాలు, ఆయుష్షు హోమం, తల్లితండ్రుల ఆశీస్సులు, పూజ, దేవాలయ దర్శనం, పూజారులు మరియు వేదపండితుల ఆశీస్సులు ఇవన్ని మిమ్మల్ని కాపాడుతాయి.

No comments:

Post a Comment