Translate

Friday, 2 December 2016

దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి ..how to wear hand ring .

దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి ? వాటి నిబందనలు ఏమిటో తెలుసుకొని ధరించడం వల్ల లాభం ఉంటుంది.  చాలా మంది దేవుడి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అలాగే చైన్ లో కూడా లాకెట్ మాదిరిగా వేసుకుంటారు. ఉదయం లేవగానే దేవుడిని కళ్ళకి అద్దుకోవడం వంటివి చేస్తాం. ఆ ప్రతిమ లలో దైవత్వం ఉందనుకుంటాం.  ఉంగరాలు కాని, గొలుసులు కాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతక రిత్యా చూసుకొని వాటిని ధరించాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది.  ఇలా ధరిస్తే అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అలాగే  ఉంగరం ధరించిన తరువాత కొన్ని జాగ్రతలు పాటించాలి.

1.భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం అస్సలు భుజించకూడదు. ఎందుకంటె మాంసాహారం తినేటప్పుడు ఆ మాంసం దేవుడి ప్రతిమ కు తగులుతుంటే ఒక్క సారి ఆలోచించండి. మనం 2.స్త్రీలు అయితే బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసివేయాలి. ఆ సమయం లో ధరించకూడదు.
3.మగ వారు ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమ కు తగులకూడదు. అంతే కాదు మద్యపానం కూడా అంతే…. ఈ పనులు చేయడమే నేరం పైగా దేవుడి ప్రతిమను దరించి చేయడం ఇంకానేరం.
ఇలాంటి తప్పులు ప్రాణాల మీదకు తెస్తాయి.జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని ధరించాలి, లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉన్నది.ఎంత తప్పు చేస్తున్నామో అర్ధమవుతుంది.

No comments:

Post a Comment