ద్వాపర
యుగంలో పడిన భారీ వర్షానికి, తుఫానుకు ఇండ్లు, గొడ్డు, గోదా, మనుషులు
అందరూ కొట్టుకుపోతుంటే వారిని రక్షించిన శ్రీకృష్ణుడు వారికి ఆశ్రయం
ఇవ్వడం కోసం గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై ఎత్తాడు. అయితే ఇప్పుడు ఆ
గోవర్ధనగిరి పర్వతం ఉత్తరప్రదేశ్‌లోని మధుర అనే ప్రాంతంలో ఉంది. ఈ
పర్వతం ప్రతి ఏటా ఆవ గింజంత పరిమాణంలో ఆకారం తగ్గుతూ వస్తుందట.
అలా తగ్గుతూ తగ్గుతూ అక్కడి భూమితో సమతలంగా ఎప్పుడైతో మారుతుందో
అప్పుడే ఈ భూమితోపాటు కలియుగం కూడా అంతమవుతుందని పురాణాలు
చెబుతున్నాయి. దీనికి సంబందించిన కథ కూడా ఉంది.
పూర్వం
పర్వతాలకు రాజైన ద్రోణకల అనే అతనికి గోవర్ధనుడు, యమున ఇద్దరూ
జన్మించారట. గోవర్ధనుడు గోవర్ధన పర్వతంగా అవతారం ఎత్తగా, యమున
నదిగా మారి ప్రవహించింది. బ్రహ్మ దేవుడి మనవడు, గొప్ప రుషి అయిన
పులస్త్యుడు ద్రోణకలుడి దగ్గరకి వచ్చి గోవర్ధన పర్వతం కాశీలో
ఉండాలని, అక్కడ ఉంటే పూజాది కార్యక్రమాలకు బాగా అనువుగా ఉంటుందని
చెబుతాడు. దీనికి ద్రోణకలుడు అంగీకరించి గోవర్ధనున్ని పులస్త్యునితో
వెళ్లమని చెప్పగా… దానికి గోవర్ధనుడు మొదట సరే అని తరవాత ఓ చిన్న
పెడతాడు. తనను మోసుకుని వెళ్లేటప్పుడు మార్గమధ్యలో అస్సలు కింద
పెట్టకూడదని, అలా పెడితే తాను రానని, కాశీ వరకు తనను దింపకుండా
అలాగే తీసుకెళ్లాలని గోవర్ధనుడు చెబుతాడు. దీనికి పులస్త్యుడు
అంగీకరించి అలాగే చేస్తాడు.
No comments:
Post a Comment