Translate

Friday, 2 December 2016

కివీ పండు తింటే మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు తగ్గిస్తాయి

కివీ ఫ్రూట్ తో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ పండును ఒక మెడిసెన్ గా మనం గుర్తిస్తాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కివీ ఫ్రూట్ కనీసం రోజుకు రెండు, మూడు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తుంది.
అంతేకాదు శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం ఈ కివీలలో ఉంటంతో చాలామంది వైద్యులు ఈ పండ్లు తినమని సలహాలు కూడ ఇస్తున్నారు. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా ఈ పండ్లు తినడం వల్ల మనకు మేలు కలుగుతుందని అనేక పరిశోధనలు కూడ తెలియచేస్తున్నాయి.





రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా సహకరించే ఈ ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటంతో కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు కూడ ఈ ఫ్రూట్స్ ఉపయోగ పడతాయి అని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.





మన శరీరంలోని రక్త సరఫరా మెరుగుపరచడానికి అదేవిధంగా శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగించ డానికి ఈ కివీ పండ్లు ఎంతో సహకరిస్తాయి. ఈ పండ్లు తినడం వల్ల గుండెకు ప్రయోజనం చేకూరడమే కాకుండా రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది.



ముఖ్యంగా రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.





కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే కివీ పండ్లను వీలైనంత ఎక్కువ తినడం మంచింది..

No comments:

Post a Comment