రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించేటప్పుడు తూర్పు,పడమర,దక్షిణ దిక్కులలో తల
పెట్టి నిద్రించడం మంచిదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఎట్టిపరిస్థితిలో
ఉత్తర దిక్కు వైపు తల పెట్టి నిద్రించడం అంత మంచిది కాదని శాస్త్రం
తెలుపుతోంది. ఎందుకంటే ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కాబట్టి నిద్ర లేవగానే
ఉత్తర దిక్కు వైపు చూస్తే అదృష్టకారకమని శాస్త్రం తెలుపుతోంది. అందువలన
పడుకోవడమే ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రిస్తే కుబేరుడి స్థానాన్ని చూడలేం
కనుక తూర్పు,పడమర,దక్షిణ దిక్కులో పడుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. దీని వల్ల
ఆ కుటుంబానికి లక్ష్మీ కటాక్షంతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని
తెలుస్తోంది.
No comments:
Post a Comment