Translate

Friday, 2 December 2016

ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మికతే కాదు నమ్మలేని ఆరోగ్య ప్రజయోనాలున్నాయి

ఓం.. అన్నది మనకు మంత్రంగానే తెలుసు. కాని ఇప్పుడు పరిశోధకులు ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనదిగా చూడరాదని పేర్కొంటున్నారు. వేదాల్లో ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రంగా నిక్షిప్తం చేశారు. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రోజుల తరబడి ఉపవాస దీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం వెనుక ఉన్న రహస్యం కూడా వారు ఓంకారాన్ని ఉచ్ఛరించడమేనట. పలు పాశ్చాత్య దేశాల్లోని యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని వెల్లడైంది. ఓం అనే శబ్దాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని లయబద్ధంగా ఉచ్చరిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..






    నాభిలోనుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగిన వారి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.
    15 నిముషాల పాటు ఓంకారాన్ని ఉచ్చరిస్తే రక్తపోటు (బీపీ) తగ్గుతుంది.
    బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
    మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.
    ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
    మెటబాలిజం (జీర్ణ క్రియ) వేగవంతం అవుతుంది.
    కిడ్నీల పనితీరు క్రమబద్ధం అవుతుంది.
    థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది.


No comments:

Post a Comment