Translate

Friday, 2 December 2016

ఒక్క రోజులో ఈ అందమైన అమ్మాయి ఎలా స్టార్ గా ఎదిగిందో తెలుసా?

సినిమా అవకాశాలు రావాలంటే తెలిసిన వారు ఉండాలి, లేదా చాలా కష్టాలు పడాలి ఇలాంటి రోజులకు ఫుల్ స్టాప్ పెట్టింది సోషల్ మీడియా. ఎవరిలో ఏ టాలంట్ ఉన్నా సోషల్ మీడియాలో పెడితే చాలు అది అలా హల్చల్ అయిపోతుంది. ఇటీవల ఇస్లామాబాద్ కి చెందిన అర్షద్ ఖాన్ అనే యువకుడు.. నీలి కళ్ళతో చాయ్ అమ్ముకుంటూ ఉన్న ఫోటోలో.. అతడి గ్లామర్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యి, దీనితో అతనికి టివి షో, మోడలింగ్ లలో అవకాశం రావడం తెలిసిన విషయమే.


ఇప్పుడు తాజాగా.. నేపాల్ కి చెందిన కూరగాయలు అమ్ముకుంటున్న యువతి అందానికి సోషల్ మీడియా షాక్ కి గురి అయింది. నేపాల్ కి చెందిన రుపీచంద్ర మహర్జాన్ అనే ఫోటో గ్రాఫర్.. ఈ ఫోటోలను తీసి సోషల్ మీడియా లో ఉంచడంతో ఆమె అందం, నవ్వు, లుక్, స్టైల్ లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేయడంతో.. రాత్రికి రాత్రి ఆమె స్టార్ గా మారింది. ఆమె అందానికి సోషల్ మీడియా లో యువకులు కూడా నీరాజనం పడుతుంటే మరోపక్క  జాతీయ మీడియా లో కూడా ఆ యువతి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment