పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టారు. అవి నమ్మకం
ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేని వాళ్ళు పాటించరు. అయితే సాధారణంగా మన
ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం సమయంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని
చెప్తూ ఉంటారు. కానీ.. సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా..
నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు..
మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట. హిందువుల ప్రకారం
లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా
చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు.
సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీకు తెలుసా? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..
సూర్యాస్తమయం తరువాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల
ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల.. మీ
సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట. ఈ విషయం చాలా మంది
ఆడవాళ్ళకు తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు ఇక నుంచి ఈ పని చెయ్యకండి.
ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు, సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోకూడదు
అట. ఎందుకంటే పురాణాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోవడం వల్ల
లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.
సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీకు తెలుసా? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..
తులసిని పూజించకూడదు:
హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత
తులసీని పూజించడం,ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం మీ
కుటుంబాన్ని వెంటాడుతుంది. తులసి మొక్కను పూజించడం, నీళ్లు పోయడం చాలా
పవిత్రంగా భావిస్తాం. కానీ.. సాయంత్రంపూట ఇది మంచిది
నెయ్యి దీపం వెలిగించొచ్చు:
సూర్యాస్తమయం తరివాత తులసిని పూజించకూడదని బాధ పడుతున్నారా? చింతించకండి
సూర్యాస్తమయం తరువాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించొచ్చు. ఇలా
చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే.. లక్ష్మీదేవిని ఇంటికి
ఆకర్షించవచ్చు.
చెత్త ఊడవకూడదు:
శృంగారం చెయ్యకూడదు:
సాయంత్రం సమయంలో.. సెక్స్ చెయ్యడం, శారీరకంగా కలవడం వంటి పనులు మంచిది
కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. సాయంత్రం సమయంలో
శారీరక సంబంధం.. దురదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి శృంగార ప్రియులు ఇక
నుంచి ఆ పనులు పగటి పూటే కానిచ్చేయండి.
నిద్రపోకూడదు:
ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసిన పెద్దగా
పట్టించుకోరు. సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో
పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే..
ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు.. కారణం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాబట్టి ఇక నుండి సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకండి.
తిన్న వెంటనే కడిగేయాలి:
ఆహారం తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే.. శని, చంద్రుల
దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం
చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు.
కాబట్టి ఇక నుంచి తిన్న వెంటనే శుభ్రం చేసేయండి.
చదువుకోకూడదు:
ఆటలు ఆడితే చాలా మంచిది:
సాయంత్రంపూట ఇంట్లో కూర్చుని చదువుకోవడం కన్నా.. పిల్లలు బయట ఆడుకోవడం
లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం చాలా మంచిదట. ఇది ఎలాగో పిల్లలు
చేసేదే. అయితే కొంతమంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని ఆటలకు
పంపించారు. ఈ విషయం ఆ తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి:
మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో, ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో
ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల.. మీ
చుట్టు పక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి
ఆగ్రహిస్తుందట. కాబట్టి ఇక నుంచి ఇలాంటి పనులు చేసే వాళ్ళు మానుకోండి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్లు.. ధనంతో కలకలలాడుతూ ఉంటుంది.
అయితే.. ఎక్కడైతే.. ఎక్కువ భక్తి, అనుకూలంగా ఉంటుందో.. అక్కడికి
లక్ష్మీదేవి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడూ..
లక్ష్మీదేవిను పూజిస్తూ ఉండాలి.
No comments:
Post a Comment