అందం అనేది కేవలం మేకప్ వల్లే రాదు. చక్కటి పోషకాహారం
తీసుకోవడం ద్వారా చర్మం కాంతిమంతంగా మారుతుంది. మీ మోము తాజాగా మెరవడానికి
ఐదు రకాల ఆహారాన్ని తరచూ తీసుకుంటే చాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
1. నిమ్మరసం :
చర్మాన్ని తాజాగా ఉంచి, ముడతలు పడనీయకుండా చూస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకున్నా లేదా రోజూ అర గ్లాసుడు తీసుకున్నా మీ చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసంతో చేసిన పదార్థాలను విరివిగా తినడం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.

2. గుడ్లు :
రోజుకో గుడ్డు తింటే మంచిది అంటారు. తినడమే కాదు. గుడ్డులోని తెల్లసొనను తీసి ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మం నునుపు దేలి మెరుస్తుంది.

3. తేనె :
ఉదయాన్నే ఒక చెక్క నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూను వేసుకుని తాగితే మంచిది. అలాగే దీనిని రోజు ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.

4. స్ట్రాబెర్రీస్ :
ఎర్రని స్ట్రాబెర్రీలు నెలలో నాలుగైదు సార్లు తినడం వల్ల చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. విటమిన్ ‘సి’ యాంటిఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని మెత్తగా చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

5. అరటి పళ్లు :
రోజుకో అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా తింటున్నప్పుడు చిన్న ముక్కతో ముఖమంతా రుద్దుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మానికి మేలు. తేనెలో ముంచి రాసుకున్నా ముఖం తాజాగా కనిపిస్తుంది

No comments:
Post a Comment