Translate

Friday, 2 December 2016

అప్పుల బాధలో ఉన్నారా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి. వాస్తు ప్రకారం శంకుస్థాపనతో కొన్ని దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి

వాస్తు ప్రకారం శంకుస్థాపనతో కొన్ని దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి
1. వాస్తు శాస్త్రం ప్రకారం శంకుస్థాపన ఎలా చేయాలంటే.. ఇంటి పొడవును తొమ్మిది భాగాలుగా చేయాలి. ఇందులో పాదాల నుంచి మూడు భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన మూడు భాగాలలో వాస్తు పురుషుడి పాదాలున్న దిశ రెండు భాగాలు వదలాలి. మిగిలిన భాగమే వాస్తు పురుషుడి నాభి స్థానం.



ఈ నాభి స్థానంలో తవ్వి నవధాన్యాలతో శంకువును స్థాపించాలి. ముందు శంకువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేశాక శంకుస్థాపన చేయాలి. గంధపు చెక్కతో కానీ, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్రకొయ్యతో గానీ శంకువును తయారుచేస్తారు. శంకుస్థాపనకు మొదటి జాము ప్రశస్తం.


రెండో జామున, మూడో జామున రాత్రులందు శంకుస్థాపన చేయకూడదు. ఇల్లు కట్టుకునేందుకు ముందు శంకుస్థాపన చేయడం మంచిది. దీనివల్ల కొన్ని దోషాలు నివారణ అవుతాయి.

2. అప్పుల బాధలో ఉన్నారా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి. ముందుగా ఉత్తర లోపాలను సరిదిద్దుకోండి. దక్షిణ భాగంలో గుంత ఉంటే వెంటనే మూసివేయండి. ఈశాన్యంలో ఓ గుంత ఏర్పాటు చేసుకోండి. ఇక ఇతరత్రా వాస్తు సలహాలను గృహపరిశీలన చేసి మార్పు చేసుకోండి.

అలాగే మీరు కొనే స్థలము ఈశాన్యము కోత పడకుండా చూసుకోండి. దక్షిణ, నైరుతి, పశ్చిమము లందు కాలువలు, సరస్సులు, గుంతలున్న స్థలములను కొనరాదు. తూర్పు, ఉత్తరములు కోత పడిన స్థలములు మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.
3. ఆగ్నేయం తగ్గివుంటే సమస్త సంపదలు చేకూరుతాయట!

మీ గృహంలో ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉందా.. అయితే మీకు సమస్త సంపదలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. అయితే ఆగ్నేయంలో ఖాళీగా మాత్రం ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడు తాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి.


అలాగే తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
అంతేకా కుండా పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్‌ ఉంటే కుటుంబసభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
4. కొన్ని గృహాల్లో ఇంటి బయట మె

ట్లు నిర్మించుకునేందుకు అవకాశము ఉండదు. అలాంటప్పుడు ఈశాన్యంలో మెట్లను నిర్మించకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా నైరుతిలో కూడా మెట్లు ఉండరాదు. ఇంటి బయటైతే నైరుతిలో మెట్లు రావచ్చు. ఇంటిలోపల నైరుతిలో రాకూడదు. ఇంటిలోపల నైరుతిలో మెట్లు వచ్చినట్లైతే నైరుతి ఖాళీ ఏర్పడుతుంది. నైరుతిలో ప్రవేశం ఎప్పటికే తప్పేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు.


ఎప్పుడూ నైరుతి ఎప్పటికీ నిండుగా ఉండాలి. స్టోర్ రూమ్ గానీ, ఇనుప పెట్ట గానీ, ఇనుప పెట్టతో పాటు యజమాని పడకగది వంటివి రావచ్చును. పశ్చిమ గోడకు లేదా దక్షిణము గోడకు మెట్లు రావచ్చును. సౌధ్యమైనంత వరకు ఉత్తరము, తూర్పు భాగములందు మెట్లు రాకుండా చూసుకోవడమే మంచిది.
అన్నిటికంటే ఉత్తమము ఇంటిలోపల మెట్లను దక్షిణము గోడకు ఆనించి గానీ, ఆనించకుండా గానీ, పశ్చిమ గోడకు మెట్లు ఆనించి గానీ, ఆనించకుండా గానీ వేసుకోవడం శ్రేష్టము.


ఒక వేళ ఇంటిలోపల రౌండ్ మెట్లను నిర్మించదలిస్తే తూర్పు వైపునగానీ లేదా ఉత్తరవైపున గానీ వేసుకోవచ్చు. అయితే మేడ పైన గదిలోనికి ప్రవేశం మాత్రము ఈశాన్యం లోనికి ఉండులాగున మెట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మెట్లను ఉత్తరము మరియు తూర్పు గోడలకు అంటకుండా వేసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment