Translate

Friday, 2 December 2016

మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకోని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు. అతని దర్శనం.




నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.








దేవాలయ ప్రాచీనత :-
భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడనీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.







“దేహమే దేవాలయం” అవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు.
నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు.
మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వార మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.




అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్న లింగాన్ని దర్శించడం అంటే మనం మన హ్రుదయాన్తరంలో వున్న ఆ సర్వేస్వరున్ని ధ్యానం ద్వార పరిపూర్ణ (సంపూర్ణ) దర్సనం చేసుకోవాలి అని ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన పెద్దలు అలోచించి అలా చేయవలసి వచ్చింది.

పదవ రోజు సోమవారం మహర్నవమి *శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం *


మహర్నవమి నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి!......
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో రేపటి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ''మహర్నవమి'' అంటారు. ''దుర్గాష్టమి'', ''విజయదశమి'' లాగే ''మహర్నవమి'' కూడా అమ్మవారికి విశేషమైన రోజు.
మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.




మహార్నవమి రోజున ఇతర పిండివంటలతోబాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు.



అమ్మవారికి అభిషేకం చేసి, ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. ఈ రోజున కుంకుమ పూజ చేయించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.





తెలంగాణా ప్రాంతాల్లో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు












Sesame, cakrapongali mom nivedincavalenu
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హేమహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే 🌷
పదవ రోజు సోమవారం మహర్నవమి
*శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం *














మహిషాసురమర్దిని స్వరూపం పద్దెనిమిది చేతులతో ప్రకాశిస్తు
అమ్మవారి రూపాలలో ప్రత్యేకత సంపాదించుకొన్నది
ఈ రోజున ఆయుధపూజ చేస్తారు .
గోధుమ రంగు చీర
నువ్వులు ,చక్రపొంగలి అమ్మకి నివేదించవలెను 




దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి ..how to wear hand ring .

దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి ? వాటి నిబందనలు ఏమిటో తెలుసుకొని ధరించడం వల్ల లాభం ఉంటుంది.  చాలా మంది దేవుడి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అలాగే చైన్ లో కూడా లాకెట్ మాదిరిగా వేసుకుంటారు. ఉదయం లేవగానే దేవుడిని కళ్ళకి అద్దుకోవడం వంటివి చేస్తాం. ఆ ప్రతిమ లలో దైవత్వం ఉందనుకుంటాం.  ఉంగరాలు కాని, గొలుసులు కాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతక రిత్యా చూసుకొని వాటిని ధరించాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది.  ఇలా ధరిస్తే అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అలాగే  ఉంగరం ధరించిన తరువాత కొన్ని జాగ్రతలు పాటించాలి.

1.భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం అస్సలు భుజించకూడదు. ఎందుకంటె మాంసాహారం తినేటప్పుడు ఆ మాంసం దేవుడి ప్రతిమ కు తగులుతుంటే ఒక్క సారి ఆలోచించండి. మనం 2.స్త్రీలు అయితే బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసివేయాలి. ఆ సమయం లో ధరించకూడదు.
3.మగ వారు ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమ కు తగులకూడదు. అంతే కాదు మద్యపానం కూడా అంతే…. ఈ పనులు చేయడమే నేరం పైగా దేవుడి ప్రతిమను దరించి చేయడం ఇంకానేరం.
ఇలాంటి తప్పులు ప్రాణాల మీదకు తెస్తాయి.జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని ధరించాలి, లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉన్నది.ఎంత తప్పు చేస్తున్నామో అర్ధమవుతుంది.

శనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి.

శనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి. అన్ని వారాల్లోను మంద వారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః” అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయినాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు. అభిషేకం చేస్తే అనుగ్రహప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కల్గి మిత్రసమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.



మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్టమాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడుకాని శనివార వ్రతం చేయాలి. శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమకు అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యధావిథిగా జపించాలి. దీనివల్ల జన వశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.


శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా వుంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు, హనుమను సమీపించి “మారుతీ! నేను శనిని, అందర్నీ పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు.’’ అన్నాడు. దానికి హనుమ “శనీశ్వరా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా వుంది?’’అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమ శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది.




ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తుకొన్నాడు హనుమ. “కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకున్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేలమీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి “మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజ లాడిపోతున్నావే?’’అని ప్రశ్నించాడు. “ప్రజలను బాధించటమే  నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను’’అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.



హనుమ “శనీ! నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించే వారిని, నాకు అభిషేకం చేసేవారిని  ఏకాలంలోనైనా ముట్టుకోకూడదు. నువ్వు బాధించరాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను”అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు. అందుకే శనివారం ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు.


“మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా”
శని వారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమపూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.

champcash ఛాంప్ కాష్ లోకి మీకు స్వాగతం నెట్వర్కింగ్ రంగంలో పెట్టుబడి లేకుండా ఆదాయం ఇస్తున్న ఏకైక కంపెనీ ఛాంప్ కాష్

champcash  ఛాంప్ కాష్ లోకి మీకు స్వాగతం నెట్వర్కింగ్ రంగంలో పెట్టుబడి లేకుండా ఆదాయం ఇస్తున్న ఏకైక కంపెనీ ఛాంప్ కాష్


== ఛాంప్ కాష్ లోకి మీకు స్వాగతం == నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో విప్లవాత్మకమైన కంపెనీ ఛాంప్ కాష్ కేవలం ఒక్క సంషత్సరంలో 40 లక్షల (4 Million+) మంది ఛాంప్ కాష్ లో రిజిస్టరయ్యారు నెట్వర్కింగ్ రంగంలో పెట్టుబడి లేకుండా ఆదాయం ఇస్తున్న ఏకైక కంపెనీ ఛాంప్ కాష్ ప్రపంచవ్యాప్తంగా 238 దేశాలలో ఛాంప్ కాష్ అందుబాటులో ఉంది ===ఛాంప్ కాష్ లో ఆదాయ మార్గాలు== =>సర్వేలలో మీ అభిప్రాయాలు తెలియజేయడం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది =>మీ క్రింది 7 లెవల్స్ లోని మీ స్నేహితులు పాల్గొన్న సర్వేలపై కూడా మీకు ఆదాయం







లభిస్తుంది =>ఆఫర్స్ వాల్ లోని ఆఫర్స్ పూర్తి చేయటం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది =>ఆప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం వలన =>ఆప్స్ మరియూ వెబ్ సైట్లలో రిజిస్టర్ అవటం వలన =>వీడియోస్ చూడటం వలన =>గేమ్స్ ఆడటం మరియూ మరిన్ని మార్గాలలో మీకు మీ క్రింది 7 లెవల్స్ లో ఉన్న టీమ్ పై ఆదాయం లభిస్తుంది =>మీ స్నేహితలలో ఎవరైనా ఇన్ కమ్ జంక్షన్ అప్ గ్రేడ్ చేసుకున్నా మీకు ఆదాయం లభిస్తుంది




. మీ నెట్వర్క్ ని విస్తరించండి మీ స్నేహితులు, బంధువులు మరియూ తోటి వారికి ఛాంప్ చాష్ గురించి తెలియజేయండి ఫేస్ బుక్ , వాట్సప్ వంటి సామాజిక సంభంధాల ఆప్స్ లో తెలియజేయండి మీ నెట్వర్క్ ఎంత పెద్దదయితే మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం మన భారతదేశంలో నెట్వర్క్ కంపెనీలలో ఛాంప్ కాష్ దే ప్రథమ స్థానం




 అంతే కాదు అతి త్వరలో ప్రపంచంలోనే ప్రథమ స్థానం సాధించగలదు ఇప్పటి వరకు భారతదేశంలో ఛాంప్ కాష్ చేస్తున్న వారికి కొన్ని కోట్ల రూపాయలు ఆదాయంగా ఇచ్చింది ఛాంప్ కాష్ అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా కొన్ని వేల మంది భారతీయులు ఛాంప్ కాష్ ద్వారా నెలకు $10 నుండి $10000 వరకు ఆదాయం పొందుతున్నారు





 మీ ఆదాయాన్ని భారతీయులైతే మీ బ్యాంక్ ఖాతాలోకి ఇతర దేశస్ధులు పేపాల్ / పేజా ద్వారా పొందగలరు తక్షణమే మీ నెట్వర్క్ ని విస్తరించండి ------------------------------------ Champcash Full Plan Powerpoint PPT in English : https://drive.google.com/file/d/0B2JS00lJgijXRkRxdHJrYXJVdms/view?usp=sharing ------------------------------- Champcash Full Plan Powerpoint PPT in Hindi : https://drive.google.com/file/d/0B2JS00lJgijXbHRTUlRGOURQOVE/view?usp=sharing ====Important==== Sponsor ID : 6004707 (Sponsor Id To Join With Me) Click To Join : http://champcash.com/6004707





అప్పుల బాధలో ఉన్నారా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి. వాస్తు ప్రకారం శంకుస్థాపనతో కొన్ని దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి

వాస్తు ప్రకారం శంకుస్థాపనతో కొన్ని దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి
1. వాస్తు శాస్త్రం ప్రకారం శంకుస్థాపన ఎలా చేయాలంటే.. ఇంటి పొడవును తొమ్మిది భాగాలుగా చేయాలి. ఇందులో పాదాల నుంచి మూడు భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన మూడు భాగాలలో వాస్తు పురుషుడి పాదాలున్న దిశ రెండు భాగాలు వదలాలి. మిగిలిన భాగమే వాస్తు పురుషుడి నాభి స్థానం.



ఈ నాభి స్థానంలో తవ్వి నవధాన్యాలతో శంకువును స్థాపించాలి. ముందు శంకువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేశాక శంకుస్థాపన చేయాలి. గంధపు చెక్కతో కానీ, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్రకొయ్యతో గానీ శంకువును తయారుచేస్తారు. శంకుస్థాపనకు మొదటి జాము ప్రశస్తం.


రెండో జామున, మూడో జామున రాత్రులందు శంకుస్థాపన చేయకూడదు. ఇల్లు కట్టుకునేందుకు ముందు శంకుస్థాపన చేయడం మంచిది. దీనివల్ల కొన్ని దోషాలు నివారణ అవుతాయి.

2. అప్పుల బాధలో ఉన్నారా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి. ముందుగా ఉత్తర లోపాలను సరిదిద్దుకోండి. దక్షిణ భాగంలో గుంత ఉంటే వెంటనే మూసివేయండి. ఈశాన్యంలో ఓ గుంత ఏర్పాటు చేసుకోండి. ఇక ఇతరత్రా వాస్తు సలహాలను గృహపరిశీలన చేసి మార్పు చేసుకోండి.

అలాగే మీరు కొనే స్థలము ఈశాన్యము కోత పడకుండా చూసుకోండి. దక్షిణ, నైరుతి, పశ్చిమము లందు కాలువలు, సరస్సులు, గుంతలున్న స్థలములను కొనరాదు. తూర్పు, ఉత్తరములు కోత పడిన స్థలములు మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.
3. ఆగ్నేయం తగ్గివుంటే సమస్త సంపదలు చేకూరుతాయట!

మీ గృహంలో ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉందా.. అయితే మీకు సమస్త సంపదలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. అయితే ఆగ్నేయంలో ఖాళీగా మాత్రం ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడు తాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి.


అలాగే తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
అంతేకా కుండా పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్‌ ఉంటే కుటుంబసభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
4. కొన్ని గృహాల్లో ఇంటి బయట మె

ట్లు నిర్మించుకునేందుకు అవకాశము ఉండదు. అలాంటప్పుడు ఈశాన్యంలో మెట్లను నిర్మించకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా నైరుతిలో కూడా మెట్లు ఉండరాదు. ఇంటి బయటైతే నైరుతిలో మెట్లు రావచ్చు. ఇంటిలోపల నైరుతిలో రాకూడదు. ఇంటిలోపల నైరుతిలో మెట్లు వచ్చినట్లైతే నైరుతి ఖాళీ ఏర్పడుతుంది. నైరుతిలో ప్రవేశం ఎప్పటికే తప్పేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు.


ఎప్పుడూ నైరుతి ఎప్పటికీ నిండుగా ఉండాలి. స్టోర్ రూమ్ గానీ, ఇనుప పెట్ట గానీ, ఇనుప పెట్టతో పాటు యజమాని పడకగది వంటివి రావచ్చును. పశ్చిమ గోడకు లేదా దక్షిణము గోడకు మెట్లు రావచ్చును. సౌధ్యమైనంత వరకు ఉత్తరము, తూర్పు భాగములందు మెట్లు రాకుండా చూసుకోవడమే మంచిది.
అన్నిటికంటే ఉత్తమము ఇంటిలోపల మెట్లను దక్షిణము గోడకు ఆనించి గానీ, ఆనించకుండా గానీ, పశ్చిమ గోడకు మెట్లు ఆనించి గానీ, ఆనించకుండా గానీ వేసుకోవడం శ్రేష్టము.


ఒక వేళ ఇంటిలోపల రౌండ్ మెట్లను నిర్మించదలిస్తే తూర్పు వైపునగానీ లేదా ఉత్తరవైపున గానీ వేసుకోవచ్చు. అయితే మేడ పైన గదిలోనికి ప్రవేశం మాత్రము ఈశాన్యం లోనికి ఉండులాగున మెట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మెట్లను ఉత్తరము మరియు తూర్పు గోడలకు అంటకుండా వేసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.

అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందట.

గృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వాస్తవానికి వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.


మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందట.


అదేవిధంగా అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుందని చెపుతున్నారు. జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుందని, పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెపుతున్నారు.


వత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని చెపుతున్నారు. అదేవిధంగా కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా, ఇంటిపై ఎలాంటి మాంత్రికశక్తులు పని చేయవని అంటున్నారు.