Translate

Sunday, 4 December 2016

రీరంలో అధనపు కొవ్వును కరిగించి.. ...

వేగంగా బరువు తగ్గించే నేచురల్ జ్యూసులు

బొద్దుగా మరియు ఫ్యాట్ ఉన్న శరీరంను చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి శరీరంతో నలుగురిలోకి వెళ్ళలేక, ఇష్టమైన దుస్తులును ధరించి, అందంగా తయారవ్వలేక చాలా ఇబ్బందికరంగా బాధపడే వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా ఎక్స్ట్రా ఫ్యాట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఊబకాయం కలిగి ఉండటం వల్ల హై కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, జాయింట్ పెయిన్, ఇన్ ఫెర్టిలిటి మొదలగు వ్యాధులను ఆహ్వానం పలకడానికి ముఖ్య సంకేతాలు . కాబట్టి, శరీరంలోని ఎక్స్ట్రా ఫ్యాట్ ను తొలగించుకోవడానికి ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను అనుసరించడం వల్ల ఎలాంటి బాధలుండవు. అదనపు కొవ్వు కరిగించుకోవడానికి ఎంపిక చేసుకొనే ఈ నేచురల్ రెమెడీస్ జ్యూసుల నుండి సేకరించినవి.

ఎందుకంటే సాలిడ్ ఫుడ్స్ తో పోల్చితే ..జ్యూసులు చాలా వేగంగా జీర్ణం అవుతాయి మరియు శరీరంలోకి చాలా వేగంగా శోషింపబడుతాయి. అంతే కాదు బరువు తగ్గించడంలో సాలిడ్ ఫుడ్స్ తో పోల్చితే జ్యూసులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . READ MORE: శరీరంలో అదనపు కొవ్వు పనిపట్టండిలా...బాడీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి మీరు తీసుకొనే జ్యూస్ థెరఫీ వల్ల చాలా వరకూ బాడీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. అందుకు ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన జూసులను మీరు రెగ్యులర్ గా తీసుకోవాలి.

ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మరియు పూర్తి పోషకాలను అందిస్తాయి.ఇంకా శరీరంకు అవసరం అయ్యే విటమిన్స్ మిరయు మినిరల్స్ ను ఎక్కువగా అందిస్తాయి.మరి ఊబకాయం తగ్గించే హెల్తీ అండ్ న్యూట్రీషియన్ జ్యూసులు ........

పీచ్ జ్యూస్ :

పీచ్ జ్యూస్ లో చాలా తక్కువ క్యాలరీలుంటాయి . ఫ్యాట్ అస్సలుండదు. రెగ్యులర్ గా పీచ్ జ్యూస్ తీసుకుంటే ఒక నెలలో బరువును తగ్గించుకోవచ్చు.

క్యాబేజ్ జ్యూస్ :

క్యాబేజ్ లో ఉండే తార్ తారిక్ యాసిడ్ షుగర్ ను ఫ్యాట్ గా మార్చకుండా సహాయపడుతుంది. క్యాబేజ్ లో విటమిన్ సి మరియు ఎ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గించడానికి మాత్రమే కాదు హార్ట్ హెల్త్ కూడా చాలా మేలు చేస్తుంది.

పార్ల్సే జ్యూస్ :

పార్ల్సే జ్యూస్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటం వల్ల ఇది శరీరంలో మలినాలను చాలా తేలికగా తొలగిస్తుంది. మరియు ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఎ లు ఎక్కువగా ఉంటాయి . బాడీ ఫ్యాట్ ను కట్ చేయడంలో ఇది ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. తేనె మరియు నిమ్మరసం: ఈ రెండింటి కాబినేషన్ లో శరీరంలో అదనపు కొవ్వు కరిగించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతాయి . ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ కు ముందు దీన్ని తీసుకోవాలి.

ఇండియన్ ప్లమ్ జ్యూస్:

దీన్ని జూజూబి ఆయిల్ అని కూడా పిలుస్తారు . ఈ నూనెలో క్యాల్షియం, ఐరన్ విటమిన్ ఎ, సి మరియు బి2 అధికంగా ఉన్నాయి . జూజూబి ఆకులను నీటిలో నానబెట్టి రాత్రంతా నానాలి. ఉదయం పరగడుపుతో త్రాగితే చాలా మేలు చేస్తుంది. ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. లెమన్ జ్యూస్ విత్ జింజర్ జ్యూస్: ఒక టేబుల్ స్పూన్ అల్లం ను ఒక చెంచా తేనె మిక్స్ చేసి నిమ్మరసంలో కలిపి ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్ జ్యూస్

క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ కరిగించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. క్యాట్ జ్యూస్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల బాడీ ఫ్యాట్ ను త్వరగా కరిగించేస్తుంది.

కీరదోస జ్యూస్:

కీరదోసకాయలో 90శాతం నీరు ఉంటుంది. క్యాలరీలుండవు కాబట్టి, పొట్టను ఫుల్ చేస్తుంది . ఫ్యాట్ సెల్స్ ను విచ్ఛిన్నం చేసి ఫ్యాట్ ను కరిగిస్తుంది . అదనపు శరీరంలోని నీరును తొలగిస్తుంది . మరియు శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఆపిల్ సైడ్ వెనిగర్ మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగితే శరీరంలోని ఫ్యాట్ కరిగిపోతుంది. పైనాపిల్ జ్యూస్: పైనాపిల్ జ్యూస్ ఎనర్జీని అంధించడంలో మరో అద్భుతమైన పండు. అంతే కాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇంకా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. దాంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ జ్యూస్ ను మరీ చిక్కగా కాకుండా పల్చగా తయారు చేసి, బాగా ఆకలిగా ఉన్నప్పుడు తీసుకోవాలి.
భీష్మ ఏకాదశి
శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి
మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము.
శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.
ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని,వ్యాస భగవానుని,పితామహుని,పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి , ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.
జై శ్రీమన్నారాయణ

Saturday, 3 December 2016

వెబ్‌ సిరీస్‌ చెయ్‌... అవకాశాలు పట్టెయ్‌!

బీచ్‌కెళ్లి తెగ ఆలోచించి స్క్రిప్ట్‌ రాసే పన్లేదు... లొకేషన్లు... షూటింగ్‌ హైరానా అసలేం అక్కర్లేదు... తీసిన బొమ్మని జనాల చెంతకు చేర్చేదెలా అనే చింతే వద్దు... నిత్య జీవితంలోని సన్నివేశాలనే యువతకు నచ్చే సీన్లుగా మార్చితే చాలు... కాస్త టాలెంట్‌కు తోడు బాగా చేయాలన్న కసి ఉంటే ప్లస్‌పాయింట్‌... వరుసపెట్టి ఎపిసోడ్లు తీసి యూట్యూబ్‌లో వదిలితే సరి! పేరు, డబ్బుతోపాటు కాలం కలిసొస్తే సినిమా అవకాశాలూ పలకరిస్తాయ్‌... అండదండలందించడానికి ఇన్‌హౌస్‌లు ఉన్నాయి... వెబిసోడ్‌ బాగుంటే ఫేస్‌బుక్‌లు.. వాట్సాప్‌లే పీఆర్‌వోలవుతాయి... ఈ కిటుకు తెలిసిన సినీప్రియులు చేస్తోందదే... అందుకే ఈ వెబ్‌సిరీస్‌లు జోరు మీదున్నాయి... ఆ వివరాలు.. ఈ ట్రెండ్‌తో స్టార్లుగా మారిన కొందరి పరిచయం.
న్‌బకెట్‌.. మహాతల్లి.. పోష్‌ పోరీస్‌.. ఈ పేర్లు తెలియని వారెవరైనా ఉంటారా? స్మార్ట్‌ఫోన్లో ఈ వీడియోలు వీక్షిస్తూ... వాట్సాప్‌లో షేర్‌ చేస్తూ నవ్వుల్లో తేలిపోయేవాళ్లు ఎక్కువే. మన లైఫ్‌లో జరిగే సంఘటనలనే కామెడీగా మార్చేస్తూ అర్రె... భలే బాగుందే అనిపిస్తూ యువతకి తెగ నచ్చేస్తున్నాయి ఈ వెబ్‌సిరీస్‌లు.
జోరు మీదున్న ట్రెండ్‌ 
వెబ్‌సిరీస్‌ మరీ కొత్త ట్రెండేం కాదు. జోరందుకుంది మాత్రం ఇప్పుడే. పర్మనెంట్‌ రూమ్మేట్స్‌, లవ్‌ బైట్స్‌, గర్ల్‌ ఇన్‌ ద సిటీ, ఐషా... అంటూ ఉత్తరాదిని ఎప్పుడో వూపేశాయివి. మన దగ్గర ఈ హల్‌చల్‌ మొదలైంది మాత్రం ఏడాది కిందటే. ముద్దపప్పు ఆవకాయ ఈ ధోరణికి శ్రీకారం చుట్టిందని చాలామంది చెబుతుంటే ‘అబ్బే మా ఫన్‌బకెట్‌నే ముందుంది’ అంటాడు డైరెక్టర్‌ హర్ష. ఇంతకు ఇందులో కొత్తదనం ఏంటి? అంటే స్టార్‌ తారాగణం... భారీ లొకేషన్లు... పెద్ద నిడివి... చెవులు చిల్లులు పడే సంగీతం... అస్సలుండవు. సినిమా హిట్‌ సన్నివేశాలకు పేరడీలు, నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే చిన్నచిన్న కష్టాలు, యూత్‌ జీవితానికి అద్దం పట్టే సీన్లు, నవ్విస్తూనే అప్పుడప్పుడు ఏడిపించే సన్నివేశాలు, అన్నింటికి మించి వీక్షకుల పెదాలపై దరహాసం చిందేలా... వికటాట్టహాసం చేయించేలా వండి వార్చిన కథలే నడిపిస్తాయి.
అందుకే విజయం 
ఏడాది కిందట వెబ్‌సిరీస్‌లు ఒకట్రెండే ఉండేవి. ఇప్పుడు సంఖ్య అర్ధశతకం దాటింది. నటన, దర్శకత్వం, సంగీతం, మరోటి... ఇరవై నాలుగు కళల్లో ఎందులో దూసుకెళ్లాలనుకున్నా ఔత్సాహికులు చూస్తోంది ఇటువైపే. కథ, కాన్సెప్టు సిద్ధంగా ఉంటే చాలు... కాస్టింగ్‌, సరంజామ, లొకేషన్లు వెతికిపెట్టే ఇన్‌హౌస్‌లు అందుబాటులో ఉండనే ఉన్నాయి. ఐదారు గంటల షూటింగ్‌తో ఓ వెబ్‌సోడ్‌ సిద్ధమైపోతుంది. నెటిజన్లను నవ్వించగలిగితే యూట్యూబ్‌లో వదిలిన ఒకరోజులోపే మినిమమ్‌ లక్ష క్లిక్‌లు గ్యారెంటీ. ఫన్‌బకెట్‌, మహాతల్లి సిరీస్‌లు మొదలైనప్పుడైతే ఆఫీసునే లొకేషన్‌గా మార్చేసి నాలుగైదు గంటల్లోనే షూటింగ్‌ పూర్తి చేసేశారు.
అండగా ఇన్‌హౌస్‌లు 
‘ఒక్క ఛాన్స్‌’ అంటూ ఆశపడే సినీప్రియులకు వెబ్‌సిరీస్‌లు ఇప్పుడు రసగుల్లాల్లా మారాయి. వాళ్లలో టాలెంట్‌ ఉంటే చాలు నటులు, సాంకేతికవర్గం, పెట్టుబడితో సహా అన్నీ సమకూర్చి పెట్టే ఇన్‌హౌస్‌లు ఇప్పుడు ఇరవైకి పైనే ఉన్నాయి. తమాడా మీడియా, తెలుగువన్‌, ఖేల్‌పీడియా, ఐక్లిక్‌, ఐ డ్రీమ్‌... వాటిలో కొన్ని. ప్రతిభ ఉంటే నిరూపించుకున్నోళ్లకు నిరూపించుకున్నంత. మొదటి అడుగే హిట్‌ అయితే అడ్డుండదు. తప్పటడుగైనా భయపడకుండా తర్వాత ఎపిసోడ్‌కి కసిగా ప్రయత్నించొచ్చు. ఫన్‌బకెట్‌ స్టార్‌ డైరెక్టర్‌ హర్ష మొదట్లో ఇలా వైఫల్యాలు ఎదుర్కొన్నవాడే. ఇక సరుకున్న వాళ్లని కొన్ని ఇన్‌హౌస్‌లు ఉద్యోగులుగానే నియమించుకుంటున్నాయి. జీతాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, కార్పొరేట్‌ ఉద్యోగులు కుళ్లుకునేంత. అలా నచ్చకపోయినా వెబిసోడ్‌కి ఇంతని జీతం మాట్లాడేసుకోవచ్చు. ఒక్క ఎపిసోడ్‌కి రూ.వెయ్యి నుంచి పదివేల దాకా పుచ్చుకునేవాళ్లున్నారు.
సెలెబ్రెటీ హోదా 
ఆదాయం... ఆశ నెరవేరడమే కాదు వెబ్‌సిరీస్‌లతో సెలెబ్రెటీ హోదా దక్కుతుంది. ఫన్‌బకెట్‌ బ్యాచ్‌ ఓ పెళ్లి కోసం హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళుతుంటే రైళ్లొ అభిమానులంతా చుట్టేసి రచ్చరచ్చ చేసేశారు. మహాతల్లి జాహ్నవి ఎక్కడ కనపడ్డా ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలంటూ కనీసం పదిమందైనా ఎగబడతారు. తనిపుడు బాగా పాపులర్‌ కావడంతో పెద్దపెద్ద హీరోలు సైతం ఆమె వెబిసోడ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అన్నట్టు ఈ ఫేమ్‌ సినిమాలకూ నిచ్చెనగా ఉపయోగపడుతోంది. రాయలసీమ మాండలికంతో పాపులరైన మహేశ్‌ ఇప్పటికే ఐదారు సినిమాలకు సంతకం చేసేశాడు. త్రిశూల్‌, రాజేశ్‌ ఉల్లిలను సైతం అవకాశాలు పలకరించాయి. చెప్పుకుంటూ పోతే వెబ్‌సిరీస్‌లు తెలుగు జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతూ సృష్టికర్తలకు పేరు, కాసులు కురిపిస్తున్నాయి. 

టాప్‌లో కొన్ని
* ఫన్‌బకెట్‌ 
* పోష్‌ పోరీస్‌ 
* ఫ్రస్ట్రేటెడ్‌ వుమన్‌ 
* కితకితలు 
* స్టేజెస్‌ ఆఫ్‌ లవ్‌ 
* కంత్రీ గాయ్స్‌ 
* చికాగో సుబ్బారావు 
* కితకితలు 
* దెయ్యం ప్రేమలో పడింది 
* ఎక్స్‌పెక్టేషన్స్‌ వర్సెస్‌ రియాలిటీ 
* మహాతల్లి (వీటిని యూట్యూబర్‌ అనాలంటోంది జాహ్నవి). 


 మాది గుంటూరు. మొదట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అదే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. గాడ్‌ఫాదర్లెవరూ లేరు. సుజిత్‌సైన్‌ స్ఫూర్తితో లఘుచిత్రాలు తీసి సినిమా ఛాన్స్‌ కొట్టేయాలనుకున్నా. ‘లైలా మజ్నూ’ తీసి యూట్యూబ్‌లో పెట్టా. ఒక్కరోజులోనే పదివేల వ్యూస్‌ వచ్చాయి. ఆ ఉత్సాహంతో మరో ఐదారు వదిలా. ‘రన్‌ రాజా రన్‌’కి రమ్మంటూ పిలుపందింది. ఆ సినిమాకి అసిస్టెంట్‌గా చేశాక తెలుగువన్‌లో చేరా. మహేశ్‌, త్రిశూల్‌లు పరిచయమయ్యారు. జనం వాడుకలో ఉన్న జోక్స్‌కి మెరుగులద్ది ఓ వెబ్‌సిరీస్‌ ప్రారంభిద్దామని ఎండీగారికి చెప్పి ఒప్పించా. రెండ్రోజుల్లోనే రెండు ఎపిసోడ్‌లు చేశాం. పెద్దగా స్పందన రాలేదు. సొంతపనిమీద వూరెళ్లినపుడు ‘నీ వీడియోలు ఆన్‌లైన్‌లో బాగా సందడి చేస్తున్నాయి. జనాల్ని తెగ నవ్విస్తున్నాయి’ అన్నారు ఫ్రెండ్స్‌. యూట్యూబ్‌ చూస్తే రెండు, మూడువేల క్లిక్స్‌ ఉన్నవి ఇరవై, ముప్ఫైవేలకు పెరిగాయి. ఇంక సీరియస్‌గా ప్రయత్నించాలని అందరం డిసైడయ్యాం. మహేశ్‌ మళ్లీ వూరెళ్లి రాయలసీమ యాసకు ఇంకాస్త పదును పెట్టుకొని వచ్చాడు. సీన్‌ బాగా పండాలని ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాం. అందుకే ప్రతి ఎపిసోడ్‌ సూపర్‌హిట్‌ అవుతూ 61వ సిరీస్‌కి చేరాం. - హర్ష అన్నవరపు, ఫన్‌బకెట్‌ డైరెక్టర్‌ 

స్వానుభవాలే కథలు 
షార్ట్‌ఫిల్మ్‌ తీయాలనే కల ఉన్నవాళ్లకి ఇప్పుడు వనరులు, అవకాశాలు ఎక్కువ. అన్నిరకాలుగా సాయం అందించే ఇన్‌హౌస్‌లు ఉన్నాయి. మనసు పెట్టి మన సత్తా నిరూపించుకుంటే చాలు. నిత్య జీవితంలో జరిగే చిన్నచిన్న సంఘటనలతోనే ఈ వెబిసోడ్‌లు రూపొందించవచ్చు. అద్దెగది కోసం పడ్డ పాట్లు, ఔటర్‌రింగ్‌ రోడ్డుమీద తప్పిపోవడం.. ఇంట్లో పెళ్లి చేసుకొమ్మని గొడవ.. ఇలాంటి స్వానుభవాలతోనే మహాతల్లి సిరీస్‌లు రూపొందిస్తున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఇంగ్లిష్‌లో బాగా పాపులరైన ‘సూపర్‌వుమన్‌’ నాకు స్ఫూర్తి. మన ఆలోచనలు పంచుకోవడానికి, సపోర్టింగ్‌ పాత్రలు వేయడానికి సహోద్యోగులుంటారు. కథలో కొత్తదనం, ఫన్‌కి ప్రాధాన్యం ఇస్తూ హావభావాలు బాగా పలికించగలిగితే ప్రతి ఎపిసోడ్‌ని హిట్‌ చేయడం పెద్ద కష్టమేం కాదు. - జాహ్నవి దాశెట్టి, మహాతల్లి 

అందరికీ నచ్చేవే 
 
యువతని నవ్వించే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌లు మొదలైనా అన్ని వయసుల వారూ ఇష్టపడుతున్నారు. నిడివి తక్కువగా ఉండటం.. సాగతీత లేకుండా విషయం సూటిగా చెప్పడం.. హాస్యంపాళ్లు ఎక్కువగా ఉండటం విజయానికి కారణాలు. ఎక్కువమందికి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండటం.. క్షణాల్లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో పంపుకునే వీలుండటం కూడా కలిసొస్తోంది. షార్ట్‌ఫిల్మ్స్‌తో పోలిస్తే వెబ్‌సిరీస్‌కి పనిచేసేవాళ్లకు దక్కే గుర్తింపు, సంపాదనా ఎక్కువే. యూట్యూబ్‌లో మళ్లీమళ్లీ కనపడటంతో బాగా పేరొచ్చి జనాలు గుర్తుపడుతున్నారు. వ్యూస్‌, యాడ్స్‌ ఎక్కువైతే సహజంగానే అందరికీ సంపాదన పెరుగుతుంది. ఒక్క తెలుగువన్‌ నుంచే ప్రస్తుతం పది వెబ్‌సిరీస్‌లు వస్తున్నాయి.

Friday, 2 December 2016

శ్రీ దుర్గా దేవి దసరా ఉత్సవాలలో ఈ రోజు అమ్మవారు "శ్రీ దుర్గా దేవి " గా పూజలు అందుకుంటుంది.

శ్రీ దుర్గా దేవి
దసరా ఉత్సవాలలో ఈ రోజు అమ్మవారు "శ్రీ దుర్గా దేవి " గా పూజలు అందుకుంటుంది.
నమస్తే శరణ్యే శివేసానుకంపే 
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే 
నమస్తే జగ ద్వంద్వే పాదారవిందే 
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే









దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి




.
పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును పఠించాలి.
దుర్గా సూక్తము పారాయణ చేయవలెను.
దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.
నివేదన: పులగము నివేదన చెయ్యాలి.









 *శ్రీ శారదాదేవి స్తుతి*
*_కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే_*
*_మరాలే మదేభే మహోక్షేధి రూఢామ్|_*
*_మహత్యాం నవమ్యాం సదా సామరూపాం_*
*_భజే శారదాంబా మజస్రం మదంబాం ||_*


శ్రీ లలితా మహా త్రిపుర సుందరి.....
దసరా ఉత్సవాలలో ఈ రోజు అమ్మవారు "శ్రీ లలితా మహా త్రిపుర సుందరిగా"




పూజలు అందుకుంటుంది...
కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||




"కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను."




త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమే ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామెశ్వర స్వరూపము అమ్మ ! పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపునలక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది .దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది. ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.







మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేసాడు . అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి "పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.













దానికి హయగ్రీవుడు "మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే" అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.
అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను,పరమకీరతకుదను వధించే ఘట్టం లో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.\














భండాసురుదిని వధించతం కోసమే ,సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించతం, సమ్రక్షించతం కోసమే అమ్మ ఆవిర్భవించింది. అదే ఆమే నిర్వహించవల్సిన .ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది






.
అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు.
భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆశ్చర్య కరమైన యుద్ధం చేసిన లలితకు "కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి " అనే నామం ఏర్పడింది.
అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. 
దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.
ఆయుధపూజ  దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.ఆంధ్రుల కనకదుర్గ...తెలంగాణ ‘బతుకమ్మ’...కన్నడిగుల చాముండి... ఇలా ప్రాంతాలు వేరయినా..విశ్వవ్యాప్తంగా ఎవరు ఏ పేరున పిలచినా...కొలిచినా విజయదశమి పర్వదినాలలో దేవి తన భక్తులను అనుగ్రహించి



... ఎవరైతే త్రికరణశుద్థిగా, సత్సంకల్పసిద్ధితో కార్యక్రమాన్ని తలపెడతారో వారి మనోసంకల్పాన్ని జయప్రదంచేసి అష్టైశ్వర్యములుప్రసాదించే భాగ్యప్రధాయని. అందుకే అంబిక,దుర్గ,భవాని..ఇత్యాది ఏ పేరున పిలచినా పలికే అమ్మలగన్న అమ్మగా...ముజ్జగాలకే మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విజయానికి ప్రతీకగా..చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా సదా ఈ పర్వదినాన్ని ప్రజలంతా జరుపుకుంటారు.అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట padakundaa శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు.









 అజ్ఞాతవాస ముగింపులో విజయదశమినాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు
 కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు.
 ఇదే ఆయుధ పూజ. విద్యార్ధులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమవృత్తికి సంబంధించిన పుస్తకాలను పూలలో పెట్టడం ఆనవాయితీ.
 ఈ రోజు నూతనంగా విద్యార్ధులు పాఠశాలలో ప్రవేశింప చేయడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.

భారత్ గురించి 35 ‘మైండ్ బ్లోయింగ్’ నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం…

భారత్ గురించి 35 ‘మైండ్ బ్లోయింగ్’ నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం…
1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.





4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.
7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.
8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.
9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.






10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.
11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి
12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.





14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి
10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.
15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.






17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.
19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.
20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.
21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.




22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.
23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి హైద్రాబాద్,తెలంగాణ,కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.
24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.
25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.
26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.






27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.
28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.






31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.
32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.
33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.
35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం ‘ఆయుర్వేద’ను అందించింది ఇండియానే.
ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది