Translate

Friday, 2 December 2016

జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకోండి

జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకోండి.
ఈ సీజన్స్ లలో ఎక్కువగా మనకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాని నుండి వచ్చే పండ్ల పైన అంతగా దృష్టి పెట్టలేరు.మనలో చాలా మంది ఏదైతే చవకగా దొరుకుందో దానిని పట్టించుకోరు, ఏదైతే చాలా ఖరీదైంది ఉంటుందో దాని వెంట పడుతుంటారు. కానీ చవకగా దొరికే దానిలో విలువైనవి ఉంటే ….. అబ్బా దీనిని అనవసరంగా ఇన్ని రోజులు మిస్ అయ్యాము అనుకుంటారు. అలాంటి వాటిలో మన పెరటిలో పండే పండ్లలలో మొదటిగా ఉండేది జామపండు ఒకటి. దీనిలో ఉండే పోషాకాలు మనకు మరి ఏ ఇతర పండ్లు ఇవ్వదు అని చెప్పవచ్చు.
జామపండు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:
జామపండులో ఏ,బి,సి, విటమిన్స్ అధికంగా ఉంటాయి.
ఈ పండులో పోషకాలు, పీచు ఎక్కువ గా ఉండి, కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు జామపండు తింటే చాలా మంచింది.
జామపండు తినడం వలన మలబద్దకం చాలా వరకు తగ్గుతుంది.
షుగర్ ఉన్నవారికి జామపండు చాలా మంచింది.
కమల పండులో దొరికే విటమిన్ సి కన్నా జామపండులో 5 రేట్లు అధికంగా లభిస్తుంది.
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ఉత్తమం అంటారు కధ!. ఆకు కూరల్లో దొరికే పీచు కంటే జామలో రెండు రేట్లు ఎక్కువగా దొరుకుంది.
ఆపిల్ లో ఉండే పిచ్ కంటే జామలో అధికంగా ఉంటుంది.
పది ఆపిల్స్ లలో ఉండే పోషకాలు ఒక్క జామకాయలోనే ఉంటాయి.

తిరుమల సన్నిధి తొలిదర్శన “భాగ్యం” ఎవరికో తెలుసా …?

లక్ష్మీదేవి కోసం భూలోకంలో వెతికివెతికి వేసారిన శ్రీనివాసుడు ఆకలితో అలమటిస్తూ వేంకటాచల పర్వతాన్ని చేరుకున్నారు. పుష్కరిణికి దక్షిణం వైపు ఒడ్డునున్న చింతచెట్టుకింద పుట్టలో చేరి ఆకలితో అలమటిస్తున్నాడు. స్వామివారి ఆకలిని తీర్చేందుకు శివుడు, బ్రహ్మ … లక్ష్మీదేవిని వేడుకుంటారు. బ్రహ్మ గోవుగా, శివుడు దూడగా … లక్ష్మి గోపాలికగా అవతారం ఎత్తుతారు.

అసాధారణమైన దేవతాంశ కలిగిన ఆవుదూడ అని చెప్పి చోళరాజు ఆస్థానానికి వెళ్ళి ఆవును విక్రయిస్తుంది గోపాలిక. అడవికి మేతకు వెళ్ళిన ఆవు గొల్లవాని కన్నుగప్పి పుట్టలో ధారగా పోసి పుట్టలో ఉన్న శ్రీనివాసుని ఆకలిని తీరుస్తుంది. ప్రతిరోజూ ఈ విధంగానే పోసి ఏమీ ఎరగనట్టు గొల్లమందలో చేరి చోళరాజు గోశాలకు చేరుకునేది. దేవతాంశ ఉట్టిపడే ఆ ఆవుపాలు రాజుగారిచే తాగించాలని ఉవ్విళ్ళూరిన మహారాణి గొల్లవానిపై ఆగ్రహిస్తుంది, రాజుకు ఫిర్యాదు చేస్తుంది. గొల్లవాడే ఆ పాలను తాగేస్తున్నాడని భ్రమించిన రాజు అతన్ని దండిస్తాడు.


మరుసటిరోజు అసలు గుట్టేమిటో రాబట్టాలన్న కృతనిశ్చయంతో గొల్లవాడు పశువులను తోలుకెళతాడు. యథాప్రకారం కొండలు, గుట్టలు దాటుకుంటూ పుష్కరిణి సమీపంలో ఉన్న పుట్టను ఎక్కి దాని బోరియలో పాలను ధారగా ఇస్తుంటుంది. అది చూసిన పశువుల కాపరి మెల్లమెల్లగా, నక్కినక్కి ఆవు దగ్గరికి చేరతాడు. గొడ్డలిని ఎత్తిపెట్టి ఒక్క వేటు వేస్తాడు. ఆవు బెదిరి పక్కకు తప్పుకుంటుంది. పుట్టలో దాగివున్న శ్రీనివాసుడు గభాలున పైకి లేస్తాడు. గొడ్డలి వేటు ఆయనకు తగులుతుంది, నుదుట గాయమవుతుంది.




నెత్తురు చూసిన గొల్లవాడు “అయ్యో! ఎంతపని చేశాను … స్వామీ క్షమించు” అంటూ భీతిల్లి శ్రీనివాసుని కళ్ళల్లోకి చూస్తూ మరణిస్తాడు. “ఈ భూలోకంలో తొలిగా నన్ను దర్శించిన ఈ గొల్లవాని పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది. కలియుగాంతం వరకూ ప్రతిరోజూ మొట్టమొదట నన్ను దర్శించే మహాద్భాగ్యాన్ని ఈ గొల్లవాని సంతతికి కల్పిస్తానని శ్రీనివాసుడు అతని మృతదేహం వద్ద ఉన్న సంతతికి వరమిస్తాడు.
ఈ నేపథ్యంలోనే ఈ ఆచారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇప్పటికీ అమలులో ఉండటం విశేషం.

శనీశ్వరుడు

వాడిని శని పట్టాడురా! అందుకే ఏమి కలిసి రావటంలేదు.” “ఏల్నాటి శని మహా తీవ్రంగా ఉంది. అందుకే ఈ ఆటంకాలు.” ఇలా మనం నిత్య జీవితంలో ‘శనీశ్వరుడిని’ అనేకసార్లు తలుచుకుంటుంటాం.  మన అవివేకం వలన గాని, మన ప్రయత్నలోపం వలన గాని ఏదైన కార్యం మంచి ఫలితాన్ని పొందలేనప్పుడు ముందుగా ఆ నెపం మోపేది శనీశ్వరుడి మీదే!  అటువంటి శనీశ్వరుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!





 మనకున్న నవగ్రహాలలో అపారమైన శక్తిసంపన్నుడు శనీశ్వరుడు.  కోటీశ్వరుడిని అరక్షణంలో కటికదరిద్రుడిని చేయగలడు. నిరుపేదను సంపన్నుడిని చేయగలడు. ఈయనను అశుభానికి, దురదృష్టానికి ప్రతీకగా చెప్పుకుంటారు. కాని ఈ శనీశ్వరుడు ఎవరు వక్రమార్గంలో నడుస్తారో, చెడు కార్యాలకు ప్రభావితులౌతారో వారిని పీడిస్తాడు.  సత్కార్యాలు చేసేవారికి శుభఫలప్రదాత.




మహోన్నతమైన సిరిసంపదలను, కీర్తిప్రతిష్టలను అనుగ్రహిస్తాడు.  శనీశ్వరుడి తండ్రి సూర్యభగవానుడు. ఈయన సోదరుడు యమధర్మరాజు. ఈయన వాహనం కాకి.  శనీశ్వరుడిని అర, కోణ మరియు క్రోధ అన్న పేర్లతో కూడా పిలుస్తారు.



ప్రతి వ్యక్తి జీవితం గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటుంది.  ప్రతి రాశిలో శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాలు నివసిస్తాడు. 12, 1వ మరియు 2వ ఇంట్లో శని నివసించినట్లయితే, అక్కడ 7 1/2 సంవత్సరాలు నివసిస్తాడు.  ఈ కాలాన్ని ‘ఏల్నాటి శని’ అంటారు.  4వ ఇంట్లో నివసించినట్లయితే ఆ కాలాన్ని ‘అర్థాష్టమ శని’   అంటారు.  8వ ఇంట్లో నివసించినట్లయితే  ఆ కాలాన్ని ‘అష్టమ శని’ అని పరిగణిస్తారు.  ఎవరికైతే ఈ దశలు కలుగుతాయో, వారిని శనీశ్వరుడు చాలా అనర్థాలు కలిగిస్తాడని నమ్ముతారు.





ఒక వ్యక్తీ జీవితంలో ఈ శనీశ్వరుడి ప్రభావం మూడు దఫాలుగా ఉంటుంది.  ప్రథమార్థంలో ‘మంగు శని’ అని, ద్వితీయార్థంలో ‘పొంగు శని’ అని, తృతీయార్థంలో ‘మరణ శని’ అని అంటారు. ఎంతటి దైవాంశసంభూతులైనా శనీశ్వరుడి శక్తి ముందు తలవంచవలసిందే!





   ఎవరి జీవితంలో శని మహర్దశ జరుగుతున్నప్పుడు, ఆయనను నిందిస్తూ ఉండటంకన్నా, ఆయన అనుగ్రహం పొందటానికి ప్రయత్నించాలి.  ఆయన అనుగ్రహం సంపాదించటానికి, ఆయనకు తైలాభిషేకాలు, జపదానాలు ఆచరించాలి. కష్టాలను, నష్టాలను, అనర్థాలను ఎదుర్కునే శక్తిని ప్రసాదించమని వేడుకోనాలి. తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు.

శనీశ్వరుడికి ఇంతటి విధ్వంసశక్తి ఎందుకు వొచ్చింది అని తెలియచెప్పే కథ ఒకటి పురాణాల్లో ఉన్నది. అదేమిటో చూద్దాం!





నిరంతరసాదనలో ఉన్న శనీశ్వరుడు తన భార్యపట్ల నిర్లక్ష్యం వహించాడు.  ఎంతటి వినయశీలి, ధర్మతత్పరత, సత్యనిష్ఠ, సదాచారసంపన్నుడు అయినా, కలకంఠీ కంట కన్నీరొలికిస్తే… అది శాపమే అవుతుంది.   శనీశ్వరుడు దీనికి అతీతుడు కాదు. ఈయన కూడా తన సతి శాపానికి గురయ్యాడు. “భార్యనైన నన్ను ఏనాడు నీవు ప్రేమపూర్వక దృష్టితో చూడలేదు. ఇకపైన నీ దృష్టి ఎవరిమీద పడుతుందో వారు దుఃఖితులవుతారు.” అని శనీశ్వరుడిని శపించింది.








  ఆ శాపం వల్లనే శనీశ్వరుడికి విధ్వంసశక్తి వచ్చిందని పురాణాలు చెపుతున్నాయి.

lord-shivaశనీశ్వరుడికి ‘శనివారం’ (saturday) అంటే మహాప్రీతి. శనివారం, త్రయోదశి కలిసి వొచ్చిన రోజును ‘శనిత్రయోదశి’ అంటారు. ఈ ‘శనిత్రయోదశి’ అంటే శివుడికి కూడా ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తే చాలా శుభం జరుగుతుంది.  ఈ రోజున నువ్వుల నూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలం రంగు పూలతో శనీశ్వరుడికి పూజలు, అభిషేకాలు జరిపించినట్లయితే మృత్యుభయం పోయి, సిరిసంపదలతో, కీర్తిప్రతిష్టలతో వర్థిల్లుతారు.

శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే ప్రతిరోజూ సాయంకాల సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద నువ్వులనూనెతో దీపం వెలిగించాలి.

 शनि उसे pattadura! एक साथ आते हैं तो क्या करना है। "" Elnati शनि गंभीरता से महान है। इसलिए इन गड़बड़ी। "यह अनन्त जीवन है, हम Shaniswara 'talucukuntuntam एक बार की संख्या। या तो हमारी अज्ञानता के कारण, हम पहले एक अच्छा परिणाम किसी भी कार्य की वजह से हो सकता है की कोशिश नहीं की जा सकती है, दिखावा है कि Shaneeswaran तुम्हारा mopedi के तहत! अब के बारे में इस तरह के Shaneeswaran पता है!






 
हमारे नवग्रहों saktisampannudu Shaniswara भारी। Katikadaridrudini araksananlo भोजन के लिए आग्रह कर सकते हैं। गरीब आदमी अमीर कर सकते हैं। उन्होंने कहा कि बुराई है, दुर्भाग्य का प्रतीक है कहा जाता है। लेकिन इस Shaniswara vakramarganlo nadustaro, जो बुरे कामों prabhavitulautaro से ग्रस्त। उन कार्यों Subhaphalapradata।


एक समृद्ध में, kirtipratistalanu दे देंगे। Suryabhagavanudu Shaneeswaran पिता। उनके भाई Yamadharmaraja। उन्होंने कहा कि वाहन कौवा। Shaniswara आधा, कोणीय और भी क्रोध के नाम से जाना जाता है।

ग्रहों भटक प्रत्येक व्यक्ति के जीवन पर निर्भर करता है। Shaniswara क्या ढाई वर्षों में से प्रत्येक में रहती है। 12, घर पर 1 और 2 शनि nivasincinatlayite, 7 1/2 साल के लिए वहाँ रहते हैं। इस बार, elnati शनि कहा जाता है। 4 घर की अवधि Nivasincinatlayite, शनि arthastama जाना जाता है। 8 घर, शनि astama कि विचार किया जाना चाहिए की अवधि Nivasincinatlayite। और मैं इन चरणों को समझाने की, उनमें से ज्यादातर का मानना ​​है anarthalu Shaniswara kaligistadani।



इस के Shaneeswaran प्रभाव एक व्यक्ति के जीवन में तीन चरणों होगा। पहली छमाही में, "शनि मंगू है कि दूसरी छमाही में," शनि फोड़ा है कि, trtiyarthanlo 'मौत, शनि कहा जाता है। Shaneeswaran talavancavalasinde पहले daivansasambhutulaina बल की राशि नहीं!


 शनि arthastama जाना जाता है। 8 घर, शनि astama कि विचार किया जाना चाहिए की अवधि Nivasincinatlayite। और मैं इन चरणों को समझाने की, उनमें से ज्यादातर anarthalu Shaniswara kaligistadani nammutaruoka Shaneeswaran एक आदमी के जीवन में प्रभाव तीन चरणों है। पहली छमाही में, "शनि मंगू है कि दूसरी छमाही में," शनि फोड़ा है कि, trtiyarthanlo 'मौत, शनि कहा जाता है। Shaneeswaran talavancavalasinde पहले daivansasambhutulaina बल की राशि नहीं! शनि, जिसका जीवन बूम के दौरान, उसे undatankanna आरोप लगाते हुए, उनका आशीर्वाद प्राप्त करने का प्रयास करने के लिए। आदेश उनके पक्ष, वह गर्मजोशी हासिल करने के लिए, japadanalu करेगाकठिनाइयों, घाटा, बिजली prasadincamani vedukonali anarthalanu मुठभेड़। दे देना चाहिए।Sanisvarudiki जागरूकता पैदा होती है यही कारण है कि इस तरह के vidhvansasakti कहानी मिथकों में से एक है। चलो देखते हैं कि यह क्या है!



Shaniswara उसकी bharyapatla nirantarasadanalo को नजरअंदाज कर दिया गया था। Vinayasili खाते, dharmatatparata, satyanistha, sadacarasampannudu हालांकि, kannirolikiste kalakanthi भर में आ ... यह अभिशाप है। यह बहुत गौरवशाली Shaniswara नहीं है। वह भी अपने सती पर एक अभिशाप डाल दिया गया था। Shaniswara कि बैठक "तुम एक प्यारी पत्नी कभी नहीं करना चाहिए, मैं नहीं दृष्टि देखा था। वे अब किसी को भी तेरा दृष्टि duhkhitulavutaru ले।"


భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి తిథిని బట్టి పుట్టినరోజు చేసుకోవాలి.

పుట్టిన రోజు అనగానే అందరూ పుట్టిన తేదిని బట్టి పుట్టినరోజు చేసుకుంటారు. ఆంగ్ల తేదీని బట్టి పుట్టిన రోజు చేసుకోవడం మన శాస్త్రం ప్రకారం సరైన పని కాదు. భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి తిథిని బట్టి పుట్టినరోజు చేసుకోవాలి. పుట్టినప్పుడు ఏమాసం తిథి ఉందొ చూసుకుని ఆ ప్రకారం జరుపుకోవాలి.
పుట్టినరోజునాడు ఉదయమే లేచి స్నానం చేసి, తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుని, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అక్కడ దేవుడితో పాటు నిత్యం ఆ స్వామి సేవలో ఉన్న ఆలయ పూజారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆయుశ్సూక్తం అనే సూక్తాన్ని చెప్పాలి, లేదా బ్రాహ్మనోత్తముడి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకా చేయగలిగితే ఆయుశ్సు హోమం చేయించుకోవచ్చు.




ఇక పార్టీలు అంటూ కేకు కట్ చేయడంతో పాటు దీపం ఆర్పుతారు. మన సాంప్రదాయం దీపం వెలిగించడమే కాని దీపం ఆపడం అంటే అశుభం. దీపం ఆపకూడదు..ఇది మన ఆచారం కాదు. ఎవరినైనా మంచివాడు కాదు అనాలంటే అమ్మో వాడా దీపాలు ఆర్పే రకం అని అంటారు. దానిని బట్టి అర్ధం చేసుకోండి దీపం ఆపడం ఎంత తప్పో.
పుట్టినరోజునాడు ఉన్నవాడిని పిలిచి, దీపాలు ఆపడంలాంటి  వేడుక కంటే ఆరోజు దానం చెయ్యాలి. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టండి. ఒంటి మీద కప్పుకోవడానికి వస్త్రం దానం చెయ్యండి. ఇలాంటి దానధర్మాలు, ఆయుష్షు హోమం, తల్లితండ్రుల ఆశీస్సులు, పూజ, దేవాలయ దర్శనం, పూజారులు మరియు వేదపండితుల ఆశీస్సులు ఇవన్ని మిమ్మల్ని కాపాడుతాయి.

వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం

మనకు నూతన సంవత్సరం ‘ఉగాది’ పండుగతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రావణమాసం చివరి వరకు విశేషమైన పండుగలు ఉండవు. అయితే ‘శ్రీరామనవమి’ ఉగాది తర్వాతే వస్తుంది. నిజానికి శ్రీరాముని మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని మనం ఒక వేడుకగా జరుపుకుంటాం గానీ.., అది పండుగ కాదు. ఎందుకంటే, శ్రీరాముడు పుట్టకముందు ఈ పండుగ లేదు. అలాగే ‘కృష్ణాష్టమి’ కూడా. శ్రీరామ, శ్రీకృష్ణులకు పూర్వం నుంచీ ‘వినాయకచవితి’ పండుగ మాత్రం ఉంది. ఇక శ్రావణ మాసంలో వచ్చే ‘వరలక్ష్మీ వ్రతం’ స్త్రీలకు సంబంధించిన ఓ వ్రతమే కానీ.., పండుగ కాదు. ఎందుకు ఇంత వివరణ అంటే.., కారణం ఉంది. అదేమిటంటే –

సంవత్సరానికి అయనములు రెండు.
ఉత్తరాయణం…, 
దక్షిణాయనం
దక్షిణాయనం దగ్గరదగ్గరగా…శ్రావణమాసం బహుళపక్షంలో ప్రారంభమవుతుంది. దక్షాణాయనంలో వచ్చే మొదటి పండుగ ‘వినాయకచవితి’. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ మీకో విషయం బాగా అర్థం అవుతుంది. మన పండుగలన్నీ ‘వినాయకచవితి’తో ప్రారంభమై…‘ఉగాది’తో ముగుస్తాయి. వినాయకుడు ఆదిపూజితుడు. మరి ఆయన పండుగ కూడా తొలి పండుగ కావడమే ధర్మం. అందుకే ప్రకృతి అలా నిర్ణయించింది. సృష్టిలో తొలి శబ్దం ‘ఓం’కారం. సంస్కృత భాషలో ‘ఓం’ అనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి ఒంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. 



‘ఓం’కారానికి ఆకారం అది. ‘ఓం’కారం అంటే ‘ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది. అది ఆయన బొజ్జ. మధ్యనుంచి వుండే తోక, ఆయన తొండం. దాని పైనున్న అర్థచంద్రరేఖ చవితి చంద్రుడు. వినాయకుడు పుట్టింది భాద్రపద శుద్ధచవితి కదా. దాని మధ్యలోనున్న బిందువు ‘హస్త’ నక్షత్రం. చంద్రుడు హస్త నక్షత్రంతో కలిసి ఉండే మాసం ‘భాద్రపదమాసం’.

Meaning Behind Symbol of Ganesha OM Symbol, Hindu Symbol Om Meaning Vinayaka Chavithi, Ganapathi OM Secrets, Ganesh Chaturthi
అంటే…వినాయకుడు భాద్రపద శుద్ధ చవితినాడు హస్త నక్షత్రంలో పుట్టాడన్నమాట. ఇదీ ‘ఓం కారం’ మనకు చెప్పే రహస్యం. ఇక – సకల విద్యలకూ,మంత్రాలకూ తొలి అక్షరం ‘ఓం’. ఏ మంత్రం ఆరంభించినా, ఓం కారంతో ప్రారంభం కావలసిందే. పిల్లలకు ‘అక్షరాభ్యాసం’ చేసేటప్పుడుకూడా..‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అని తొలిసారిగా వ్రాయిస్తారు. అందుకే..వినాయకుడు సర్వ విద్యలకూ, సకల మంత్రాలకూ అధినాథుడు. తనే ముందుండి ఈ చరాచర జగత్తును నడిపిస్తూంటాడు. విఘ్నాలు రాకుండా కాపాడుతూంటాడు. అందుకే.., ఆయన జన్మదినం ఈ జగత్తుకే పండుగ దినమైంది. వినాయకుడు అల్పసంతోషి. ఆయనను పూజించడానికి పెద్దగా ఆచారాలు పాటించ నక్కరలేదు. మనం అలిసిపోయేలా అభిషేకాలు చేయ నక్కరలేదు. ఖర్చుతో కూడిన నైవేద్యాలు సమర్పించ నక్కరలేదు. భక్తిగా నాలుగు గరిక పరకలు ఏరుకొచ్చి మీదవేసినా.., ఓ రెండు చప్పిడి కుడుములు ముందుంచి తినమని చేతులు తిప్పినా.., పొంగిపోతూ స్వీకరించే దేవుడు ఎవరయ్యా అంటే ‘వినాయకుడు’ ఒక్కడే. పూజించినంత కాలం పూజించి, చివరి రోజున తీసుకెళ్ళి నీటిలో పారేసినా., చిరునవ్వుతో దీవిస్తాడేకానీ, కోపగించి శపించడు.  అందుకే ఆయన పిల్లలదగ్గర నుంచి పెద్దల వరకు అభిమాన పాత్రుడయ్యాడు..ఆరాధ్య దైవమయ్యాడు.
అసలు ‘వినాయకుడు’ ఎవరు?
ఆయన పుట్టుకకు కారణం ఏమిటి?
తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ… ఉంటుంది మరి. అయితే –
రేపు ఇదే ‘వెబ్ సైట్’కి… ‘లాగిన్’ అవ్వండి. ‘వినాయకుని’ విశేషాలు చదివి ఆనందించండి.

తప్పకుండా షేర్ చెయ్యవలసిన పోస్ట్ : దీపరాధన ఎలా చెయ్యాలి అని అందరికీ తెలిసేలా చెయ్యండి

దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.
కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి.
కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.
దీపారాధన చేసేముందు దేవుడి ముందు పెట్టే కుందుల్లో నూనె, 2 వత్తులు వేసుకొని ఉంచుకోవాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో ( హారతి ఇచ్చే వస్తువు) కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధనని చేయాలి. అగరొత్తులు, ఏకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు దీపారాధన నుండి వెలిగించకూడదు.






దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు.
అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.




దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మి కి , నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతి కి ముఖ్యము. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తి కి చాలా ముఖ్యము.
ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏదో ఒక తైలము శ్రేష్ఠము. ఎట్టి పరిస్ధితులలో శనగనూనె వాడరాదు.


నెయ్యి ——–మహాలక్ష్మి కటాక్షం (ఆవు నెయ్యి, విప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.)
ఆముదం ——కష్టాలు తొలుగుట, ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు పొందుతారు
నువ్వులనూనె —— మద్యమం(దుష్ట శక్తి , శతృ బాధలు తొలుగుతాయి)



దీపం కొండెక్కింది అనాలి. దీపారాధన పూర్తయింది, ఆరిపోయింది అని అనకూడదు.
తెల్లవారుఝామునే లేచి స్నానాదులు ముగించుకొని దైవారాధన చేయాలి. తెల్లారి 5 గంటల లోపు స్నానం చేస్తే దానిని బుషిస్నానం, 5-6 గంటల వేళ స్నానం చేస్తే దైవస్నానం, 6-7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. (ఇప్పుడు మిట్టమధ్యాహ్నం వరకు స్నానాదులు చేయకుండా మిగిలిన పనులు పూర్తిచేస్తున్నారు. అది ఇంటికి, మనకి కూడా మంచిది కాదు.)

Thursday, 1 December 2016

లెక్కకు మించిన బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్క చెప్పాలంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండాలి అనే దానిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి. సొంతంగా సంపాదించిన డబ్బుతో బంగారం కొంటే ఇబ్బందిలేదన్నారు. పన్ను మినహాయింపు పొందిన డబ్బుతో కొనుగోలు చేసినా సమస్యలు ఉండవన్నారు. ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే తప్పులేదని వివరణ ఇచ్చారు. వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.

బంగారంపై మరిన్ని వివరాలు :

… వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. సీజ్ చేయం
… ఒక్కో వివాహిత మహిళ 500 గ్రాముల (అరకిలో) బంగారం ధరించవచ్చు
… వివాహం కాని మహిళ 250 గ్రాముల బంగారు ఆభరణాలు ధరించవచ్చు
… మగాళ్ల దగ్గర 100 గ్రాముల బంగారానికి మించి ఉండరాదు
… మహిళలు, పురుషుల దగ్గర ఉండాల్సిన బంగారం కంటే అధికంగా అంటే.. అది లెక్కల్లో చూపిన డబ్బుతో కొనుగోలు చేసినది అయితే మాత్రమే చర్యలు ఉంటాయి.
… లెక్కల్లో చూపిన డబ్బుతో కొనుగోలు చేసిన బంగారాన్ని సీజ్ చెయ్యం
… పన్ను మినహాయింపు పొందిన ఆదాయంతో బంగారం కొనుగోలు చేసినా ఇబ్బందులు ఉండవు
… లెక్కల్లో చూపని ఆదాయంతో బంగారం కొనుగోలు చేస్తే ట్యాక్స్ వేస్తారు.
… స్త్రీధనంగా వచ్చిన బంగారంపై ఆంక్షలు ఉండవు
… లెక్కచూపని బంగారంపై భారీగా పన్ను ఉంటుంది
… రద్దయిన పెద్ద నోట్లతో బంగారం కొని.. నిల్వ చేసుకునే వారి కుట్రలు భగ్నం చేస్తాం.