Translate

Friday, 2 December 2016

శివుడు ఎందుకు శ్మశాన వాసి అయ్యాడు?

శివం అంటే కాల్యాణం, శుభం అని అర్థం. శుభాన్ని కలిగించే వాడు శివుడు.
”అరిష్టం శివోతి తనూకరోతి” అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం”.




శివుడు నిర్గుణుడు. లయకారుడు. నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంతతత్త్వం ఉన్నవాడు. సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్త్వం అనేది స్థిరపడింది.





అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి, దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశాన వాసి అయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు.





అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక, మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను, మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది.





అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరంనుడి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరుకాగానే, వెళ్ళి పోగానే శుభప్రదమైన దేహం ‘శివము’ నుండి అమంగళకరమైన ‘శవము’గా మారిపోతుంది.

అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా, చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువునా ఒంటపట్టించు కోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరి స్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు.





బూడిదనే విభూది. మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి, పంచభూతాలలో కలిసిపోతాడు. శివుడి శరీరంమీద ఉండే బూడిద, లౌకిక సుఖాలనుంచి దూరంగా ఉండి, ఆధ్యాత్మికత దిశగా మనను మళ్లించాలని చెబుతుంది.





దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యేవేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.



కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారేవరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి … ఆ పరమేశ్వరుడు ఒక్కడే.



సాధారణంగా శివాలయ దర్శనం చేస్తుంటాము, శివాలయానికి వెళ్ళినప్పుడు నిర్మలమైన మనస్సుతో, ఏమి ఆలోచించకుండా కొద్దిసేపు కళ్లు మూసుకుని, ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాతంత తప్పకుండా లభిస్తుంది. మనస్సు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చుని రండి. మీకే ఆ తేడా తెలుస్తుంది. అందువల్ల శివాలయం కూడా స్మనాశం వంటిది అన్నారు.





సృష్టి క్ర‌మం ఎలా ప్రారంభ‌మైందో ఇప్పుడు తెలుసుకుందాం

ఏన్నో సంవత్స‌రాల కింది నుంచే అనేక మంది శాస్త్రవేత్త‌లు అస‌లు ఈ సృష్టి క్ర‌మం ఎలా ప్రారంభ‌మైంద‌నే దానిపై అనేక ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అందుకు సంబంధించిన ఏ చిన్న విష‌యాన్ని కూడా దాదాపుగా ఏ సైంటిస్టూ క‌నిపెట్టలేక‌పోయాడు. అయినా వారు తమ త‌మ ప‌రిశోధ‌న‌ల‌ను మాత్రం ఆప‌డం లేదు.






ఎప్ప‌టికైనా సృష్టి క్ర‌మానికి చెందిన ర‌హ‌స్యాన్ని క‌నిపెట్టాల‌ని వారు త‌ప‌న ప‌డుతున్నారు. అయితే దీని విష‌యం అలా ఉంచితే, హిందూ పురాణాల్లో మాత్రం సృష్టి క్ర‌మానికి చెందిన ప‌లు అంశాల‌ను ఎంతో మంది పండితులు, రుషులు పేర్కొన్నారు. 





ఆయా పురాణాల్లో స‌ద‌రు అంశాల‌కు చెందిన ప్ర‌స్తావ‌న‌లు కూడా ఉన్నాయి. ప్ర‌ధానంగా బ్ర‌హ్మ పురాణం, గ‌రుడ పురాణం వంటి పురాణాల్లో సృష్టి క్ర‌మానికి చెందిన ప‌లు విష‌యాలు మ‌న‌కు తెలుస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.





మ‌న‌కు 60 సెకండ్లు 1 నిమిషం. 60 నిమిషాలు 1 గంట‌. 24 గంట‌లు ఒక రోజు. కానీ బ్ర‌హ్మ దేవుడికి ఒక రోజు మాత్రం అలా ఉండ‌దు. 1000 మ‌హాయుగాలు గ‌డిస్తే అప్పుడు బ్ర‌హ్మ‌కు ఒక రోజు పూర్త‌యిన‌ట్టు లెక్క‌. మ‌హాయుగం అంటే స‌త్య యుగం, త్రేతా యుగం, ద్వాప‌ర యుగం, క‌లియుగం… ఇలా 4 యుగాలు క‌లిస్తే అప్పుడు ఒక మ‌హాయుగం అవుతుంది.







 ఈ ఒక్క‌ మ‌హాయుగం పూర్త‌వ్వాలంటే మ‌న కాల‌మానం ప్ర‌కారం 43.20 ల‌క్ష‌ల సంవ‌త్స‌రాలు గ‌డ‌వాల్సి ఉంటుంది. అప్పుడు ఒక మ‌హాయుగం పూర్త‌వుతుంది. అలాంటి మ‌హాయుగాలు 1000 గ‌డిస్తే అప్పుడు బ్ర‌హ్మ‌కు ఒక రోజు గ‌డిచిన‌ట్టు అవుతుంది. ఇలా బ్ర‌హ్మ‌కు ఒక రోజు గ‌డ‌వ‌గానే విశ్వ‌మంత‌టికీ మహా ప్ర‌ళ‌యం వ‌స్తుంది.








మ‌హా ప్ర‌ళ‌యం వచ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ నిద్ర‌లోకి వెళ్తాడ‌ట‌. ఈ క్ర‌మంలో విశ్వ‌మంతా నీటిమ‌యం అవుతుంద‌ట‌. చుట్టూ క‌నుచూపు మేర‌లో ఎక్క‌డ చూసినా నీరే ఉంటుంద‌ట‌. సూర్యుడు, చంద్రుడు, అన్ని గ్ర‌హాలు, న‌క్ష‌త్రాలు బ‌ద్ద‌లైపోయి ఆ నీటిలో క‌లిసిపోతాయ‌ట‌. అలా జ‌రిగాక బ్ర‌హ్మ మ‌ళ్లీ మేల్కొని కొత్త సృష్టిని చేయ‌డం ప్రారంభిస్తాడ‌ట‌






. ఆ క్ర‌మంలో ముందుగా ఏక క‌ణ జీవులు పుట్టుకువ‌చ్చి, అనంత‌రం మ‌ళ్లీ జీవ ప‌రిణామ క్ర‌మం మొద‌లవుతుంద‌ట‌. అయితే విశ్వ‌మంతా నిండిపోయిన నీటిని మ‌ధించ‌డం కోసం బ్ర‌హ్మ ఏకంగా విశ్వ‌మంత ఎత్తుకు పెరిగి నేల‌ను పైకి తీసుకువ‌స్తాడ‌ట‌. దీంతో సృష్టి మ‌ళ్లీ ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. దీని గురించే పైన చెప్పిన పురాణాల్లో రాశారు. ఏది ఏమైనా, సృష్టి క్ర‌మం క‌చ్చితంగా ఎలా ప్రారంభ‌మైందో చెప్ప‌డం మాత్రం క‌ష్ట‌మే. ఇంత‌కీ దీనిపై మీ అభిప్రాయ‌మేమిటి..?

30 యేళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే…..ఎదుర్కోవాల్సిన 6 ప్రధాన సమస్యలు.!

జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి…ఈ మద్యకాలంలో చాలామంది యువతీ యువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇష్టంలేకపోవడం , వివాహం తర్వాత అనుకోకుండా ఎటువంటి ఆపద వచ్చినా…ఆర్థికంగా తట్టుకొని నిలబడడం కోసం చాలా మంది యువకులు..లైఫ్ లో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో చాలామంది 30-35 యేళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు. జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ….35 దాటాక పెళ్లి అంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులేంటో ఓ సారి చూద్దాం.










 డబ్బుకు అధిక ప్రియారిటీ ఇవ్వడం:
30 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ జీవితం మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. డబ్బు యొక్క ప్రాముఖ్యత తెలిసివస్తుంది. ఈ సమయంలో పెళ్లి అయితే….సదరు యువతీ/యువకులు ప్రధాన లక్ష్యం వీలైనంత డబ్బు సంపాదించాలనే ఉంటుంది. ఈ క్రమంలో తమ వైవాహిక జీవితం మీద అంతగా శ్రద్ద పెట్టరు. ఒకరి ఇష్టాఇష్టాలను అంతగా పట్టించుకోరు. దీంతో వైవాహిక జీవితం సాఫీగా సాగదు.





 ఉత్సుకత తగ్గిపోవడం:
25-30 పెళ్లికి సరైన వయస్సు…..30 దాటాక…స్త్రీ/పురుషుల సాంగత్యం కోసం వెంపర్లాడే ఉత్సుకత తగ్గిపోతోంది. ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ తగ్గినా వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదు.






జీవిత భాగస్వామికి ఎక్కువ టైమ్ ఇవ్వలేకపోవడం:
ఈ వయస్సుకు వచ్చే సరికి ఉద్యోగ పరంగా సీనియారిటీ రావడం, కొన్ని అధనపు బాధ్యతలను మోయాల్సి రావడంతో….జీవిత భాగస్వామికి తగిన సమయాన్ని కేటాయించలేరు. ఇది….. ఇల్లీగర్ ఎఫైర్స్ కు కూడా కారణం కావొచ్చు.



సమాజపు ఒత్తిడులు:
మీకు పెళ్లి అయ్యే సమయానికి, మీ ఫ్రెండ్స్ కి..స్కూల్ కి వెళ్లే పిల్లలుండడం…ఇది కాస్తంత గిల్టీ ఫీలింగ్ కు కలిగించే అంశం… ఈ విషయంలో బంధువుల నుండి చుట్టుపక్కల నుండి ఒత్తిడులు అధికం అవుతాయి.





శృంగార పటుత్వం తగ్గిపోవడం:
స్త్రీ, పురుషుల లైంగిక అవయవాల పనితీరు 25-30 సంవత్సరాల మధ్య ఉన్నత స్థితిలో ఉంటుంది. పురుషులలో అయితే 30 తర్వాత శుక్రకణాలు సంఖ్య క్రమంగా తగ్గుతుంటుంది. ప్రస్తుత కాలంలో కాలుష్యం, పోషకాలు లేని ఆహారం, పని ఒత్తిడుల కారణంగా..మగాళ్లలో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 25-30 వయస్సులో ఒక ML వీర్యంలో 130 మిలియన్స్ ఉండాల్సిన శుక్రకణాలు ఇప్పుడు 105 మిలియన్స్ కు పడిపోయాయని WHO నే చెప్పింది.



జీవితపు మాధుర్యాన్ని కోల్పోవడం:

30-35 వరకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు….ఉద్యోగం దొరకడం, టైమ్ టు టైమ్ జాబ్ చేయడం, తర్వాత పెళ్లి,  ఆ వెంటనే పెళ్లి…..పిల్లలు,వారి చదువులు, వారి లైఫ్ ప్లానింగ్. ఈ మొత్తం క్రమంలో….జీవితపు మాధుర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చేసుకున్న వారితో కూడా సంతోషంగా గడపలేని పరిస్థితి నెలకొంటుంది.

మీ అరచేతిని చూసి..మీరు చేసుకోబోయేది లవ్ మ్యారేజా? అరేంజ్డా? అని చెప్పొచ్చు! అదెలాగో తెలుసా

పెళ్ళి…..ఒంటి ప్రయాణం జంటగా మారే సందర్భం. ఒకరితో కలిసి మరొకరు నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టే క్షణం. అతంటి విశేషమైన పెళ్లి గురించి…. తనకు తోడుగా వచ్చే భాగస్వామి గురించి.. ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి తమ కంటూ ఓ ఊహాలోకాన్ని నిర్మించుకొని, కలలు కనడం సాధారణ విషయమే.!






అయితే చేతిగీతలను బట్టి తమను చేసుకోబోయే..అబ్బాయి/అమ్మాయి ఎలాంటిదో ముందుగానే తెల్సుకోవొచ్చట! అంతే కాదు….చేసుకోబోయేది లవ్ మ్యారేజా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? అని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చట!! అదెలాగో ఓ సారి చూద్దాం.palmology


 మీ చేతి మీద ఈ ఈ ప్లేస్ లలో….ఇక్కడ చూపించిన గుర్తులు కనిపిస్తే మీది ప్రేమ వివాహమే: ( Right Palm):

కుడి అరచేతిని ఓ సారి పరిశీలించుకోండి….ఈ నాలుగు గుర్తుల్లో..ఏ రెండు గుర్తులు మీకున్నా…మీది ప్రేమ వివాహమే!



1)పై రేఖ  పైన ఓ చిన్నపాటి బారుగీత.

2)కుడి చేతి చూపుడు వేలి కింగ ఇంటు మార్క్.

3) కుడి అరచేతిని అడ్డంగా పెట్టుకున్నప్పుడు బొటన వేలి కింద ప్రాంతంలో ఓ బాక్స్ లాగా కనిపిస్తే వారిది..లవ్ మ్యారేజే.!

4) మూడవ అడ్డగీత, రెండవ అడ్డగీత ను కలుపుతూ ఇంకో చిన్న గీత ఉంటే………!

palm




 ఆరేంజ్డ్ మ్యారేజే.!

అర చేతిని ఒకవైపుగా  నిలువుగా పెట్టినప్పుడు  చిటికెన వేలు…కింది భాగంలో ఉండే లైన్స్ చిన్నవిగా ఉంటే వారిది పెద్దలు కుదిర్చిన వివాహమే… లవ్ మ్యారేజ్ లో లేని ఆనవాళ్లు కనిపించినా..వాళ్లది కూడా ఆరేంజ్డ్ మ్యారేజే.!

ఆలు-మగల బంధం ఎలా ఉండబోతోంది:

రెండు అరచేతులను ఆనించి, వాటిని చాచినప్పుడు వాటి మీదున్న మధ్యలైన్స్ కలిసి ఉన్న విధానాన్ని బట్టి…చేసుకోబోయే భార్య ఎలా ఉంటుందనే విషయం కూడా చెప్పొచ్చు..అదెలాగంటే.






  రెండు అర చేతులు కలిపినప్పుడు అర్ధ్ర చంద్రాకారం గుర్తు వస్తే:  చాలా మంచి భార్య దొరుకుతుంది, కుటుంబంతో ఇట్టే కలిసిపోతుంది.


    రెండు అర చేతులు కలిపినప్పుడు కుడిచేతి అడ్డు గీత పైకి ఉంటే: తన వయస్సు కంటే ఎక్కువ వయస్సున్న భార్య దొరకుతుంది, ఇలా ఉన్న వారికి ఆదర్శభావాలు ఎక్కువ.


half-moon-from-both-hand-heart-line


    రెండు అర చేతులు కలిపినప్పుడు ఎడమ చేతి గీత పైకి ఉంటే: చదువుకుంటున్న ఆమ్మాయిలను పెళ్ళిచేసుకుంటారు. వీరికి అందమైన భార్య దొరుకుతుంది.


సాయి బాబా గురించి రహస్యాలు వెల్లడించిన ముంబాయి కోర్టు

షిరిడి సాయిబాబాకు అనేక మంది భక్తులు ఉన్నారు. ఏ ఆనందం వచ్చినా ఆపద వచ్చినా ఆయనను శరణు కోరితే ఆదుకుంటారని నమ్మకం. అందుకే రోజురోజుకి శిరిడికి భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది. నిలయం నిర్వాహకుడు అనంత బొట్ల సుధాకర్‌ మాట్లాడుతూ…

 




 షిరిడి సాయిబాబాకు మతాన్ని ఆపాదించడం సరికాదని అన్నారు.  సాయిబాబా దైవ స్వరూపుడని, కులమతాలకు అతీతమైన వాడని ఆయన అభిప్రాయపడ్డారు.






 బాబా అసలు పేరు హరిభావుభూసారి అని ఆయన కౌశికగోత్రంలో జన్మించినట్టు, ముంబై పబ్లిక్‌ ట్రస్ట్‌ యాక్ట్‌ 1950 ప్రకారం సాయిబాబా జన్మించిన స్థలాన్ని గుర్తించారని, ఆయన గురించి అనేక విషయాలు వెల్లడించారని తెలిపారు.

ఈ కథను విన్నవారికీ, చదివిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్య దాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది

లక్మీ వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజ గదిలో కానీ గదిలో ఒక మూల గానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి.




కావలసిన వస్తువులు 
పసుపు, కుంకుమ, ఎర్రటి జాకెట్టు బట్ట, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరానికి అవసరమైన దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, శనగలు.



తోరం ఇలా తయారు చేసుకోవాలి 
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించాలి. ఈ విధంగా తోరాలను పూజించిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి.


వరలక్ష్మీ వ్రత కథ
ఇది తరతరాలనుంచి భారతీయ సంప్రదాయంలో కలిసిపోయిన వరలక్ష్మీ వ్రత కథ. స్ర్తీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని గురించి కైలాసంలో శివుడు పార్వతికి చెప్పాడు. భగవత్‌ సమానులైన ఋషుల ద్వారా ఈ కథ భూలోక వాసులకు తెలిసింది. నాటినుంచి ఏటా కోట్లాది మంది ముత్తైదువులు శ్రావణ శుక్రవారం నోము నోచిన రోజు వరలక్ష్మీ వ్రత కథను పారాయణం చేస్తున్నారు. ఈ కథను శౌనకాది మహామునులకు సూతపౌరాణికుడు చెప్పాడు.



‘‘స్ర్తీలకు వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి’’ అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. పార్వతీ దేవికి వరలక్ష్మీ వ్రతం గురించి ఇలా చెప్పాడు. ‘‘ఓ పార్వతీ, వరలక్ష్మీ కథను చెబుతున్నాను. శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్ర్తీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతి రోజూ తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్త మామలను సేవిస్తూ, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒక రోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి ‘‘నేనమ్మా.. వరలక్ష్మీదేవిని. నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను’’ అని చె ప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి –




‘‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే
శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే 

ఓ జగన్మాతా! నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు. విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది’’ అంది కలలోనే. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విష యాలను అత్తమామలకును, ఇరుగుపొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మీ వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది.




చారుమతి చెప్పినప్పటి నుంచి స్ర్తీలు శ్రావణమాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్ర వారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజగదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేశారు.




ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్ర్తీలతో కలసి ‘‘పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవసర్వదా’’ అని ధ్యానించి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది. పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది.
ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తికాగానే ఆ స్ర్తీలందరి కాళ్లలో ఘల్లు ఘల్లుమనే శబ్దం వినిపించింది. ఆ స్ర్తీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్లవైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి, మిగిలిన స్ర్తీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారు మతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తురగ వాహనాలతో, సౌభా గ్యంతో నిండిపోయింది.




వ్రతంలో పాల్గొన్న స్ర్తీలను తీసుకుపోవటానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటివద్ద నిలిచాయి. తమచేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధం, పుష్పాలతో పూజించారు. దక్షిణ, తాంబూలము, పన్నెండు భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధువులతో కలసి భుజించాక వాహనాలలో స్ర్తీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.






ఆ రోజునుంచి చారుమతితో పాటు పలువురు స్ర్తీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ, సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారూ చేయవచ్చు. ఈ కథను విన్నవారికీ, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్య దాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది.’’ అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు.
ఈ కథ అనంతరం అక్షతలు శిరస్సున ధరించి, పసుపు కుంకుమలను గడప మధ్యలో పెట్టాలి

ఇంట్లోకి ధనలక్ష్మి… సుఖ సంతోషాలు రావాలంటే… మీ ఇంట్లో ఈ ఒక్క ఫోటో ఉంటే చాలు..

Dhanlaxmi ... pleasure to give happiness in the house ... if your house put this one photo ..
కాలం మారింది. వేగంగా పరుగెత్తితేగానీ దేన్నీ అందులోక పోతున్నాము. ఈ వేగంలో మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నాం. కుటుంబం, బంధు, మిత్రులతో మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఈ ఫొటో ఒక్కటి ఉంటే చాలట…

ఇల్లు సిరిసందలతో, సుఖ సంతోషాలతో తులతూగుతుందని శాస్త్రం చెపుతోంది. ఐష్టశ్వర్యాలు ఇంట్లోకి వస్తాయట. పంచముఖ ఆంజనేయ స్వామి ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుందట.





తూర్పుముఖముగా హనుమంతుడు:
పాపాలను హరించి, చిత్త శుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు




కరాళ ఉగ్ర నరసింహ స్వామి:
శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.

పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి:
దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు.

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి:
గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు.



ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి:
జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

రామాయణం ప్రకారం.. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.






పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.