Translate

Friday, 2 December 2016

అప్పుల బాధలో ఉన్నారా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి. వాస్తు ప్రకారం శంకుస్థాపనతో కొన్ని దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి

వాస్తు ప్రకారం శంకుస్థాపనతో కొన్ని దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి
1. వాస్తు శాస్త్రం ప్రకారం శంకుస్థాపన ఎలా చేయాలంటే.. ఇంటి పొడవును తొమ్మిది భాగాలుగా చేయాలి. ఇందులో పాదాల నుంచి మూడు భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన మూడు భాగాలలో వాస్తు పురుషుడి పాదాలున్న దిశ రెండు భాగాలు వదలాలి. మిగిలిన భాగమే వాస్తు పురుషుడి నాభి స్థానం.



ఈ నాభి స్థానంలో తవ్వి నవధాన్యాలతో శంకువును స్థాపించాలి. ముందు శంకువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేశాక శంకుస్థాపన చేయాలి. గంధపు చెక్కతో కానీ, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్రకొయ్యతో గానీ శంకువును తయారుచేస్తారు. శంకుస్థాపనకు మొదటి జాము ప్రశస్తం.


రెండో జామున, మూడో జామున రాత్రులందు శంకుస్థాపన చేయకూడదు. ఇల్లు కట్టుకునేందుకు ముందు శంకుస్థాపన చేయడం మంచిది. దీనివల్ల కొన్ని దోషాలు నివారణ అవుతాయి.

2. అప్పుల బాధలో ఉన్నారా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి. ముందుగా ఉత్తర లోపాలను సరిదిద్దుకోండి. దక్షిణ భాగంలో గుంత ఉంటే వెంటనే మూసివేయండి. ఈశాన్యంలో ఓ గుంత ఏర్పాటు చేసుకోండి. ఇక ఇతరత్రా వాస్తు సలహాలను గృహపరిశీలన చేసి మార్పు చేసుకోండి.

అలాగే మీరు కొనే స్థలము ఈశాన్యము కోత పడకుండా చూసుకోండి. దక్షిణ, నైరుతి, పశ్చిమము లందు కాలువలు, సరస్సులు, గుంతలున్న స్థలములను కొనరాదు. తూర్పు, ఉత్తరములు కోత పడిన స్థలములు మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.
3. ఆగ్నేయం తగ్గివుంటే సమస్త సంపదలు చేకూరుతాయట!

మీ గృహంలో ఆగ్నేయ దిశలో స్థలం తగ్గి ఉందా.. అయితే మీకు సమస్త సంపదలు చేకూరుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. అయితే ఆగ్నేయంలో ఖాళీగా మాత్రం ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ గృహంలో ఆగ్నేయ దిశ స్థలం ఎక్కువ ఖాళీగా ఉంటే మాత్రం సమస్త సంపదలు హరింపబడు తాయి. ఇంకా అప్పుల బాధ, ఈతిబాధలు వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి.


అలాగే తూర్పుతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించే వారికి సంతాన ప్రాప్తి ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణంతో కలిసి పెరిగిన ఆగ్నేయ స్థలంలో నివసించేవారికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
అంతేకా కుండా పడకగదిలో ఆగ్నేయం వైపు బెడ్‌ ఉంటే కుటుంబసభ్యులు మానసిక ఆందోళనకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
4. కొన్ని గృహాల్లో ఇంటి బయట మె

ట్లు నిర్మించుకునేందుకు అవకాశము ఉండదు. అలాంటప్పుడు ఈశాన్యంలో మెట్లను నిర్మించకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా నైరుతిలో కూడా మెట్లు ఉండరాదు. ఇంటి బయటైతే నైరుతిలో మెట్లు రావచ్చు. ఇంటిలోపల నైరుతిలో రాకూడదు. ఇంటిలోపల నైరుతిలో మెట్లు వచ్చినట్లైతే నైరుతి ఖాళీ ఏర్పడుతుంది. నైరుతిలో ప్రవేశం ఎప్పటికే తప్పేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు.


ఎప్పుడూ నైరుతి ఎప్పటికీ నిండుగా ఉండాలి. స్టోర్ రూమ్ గానీ, ఇనుప పెట్ట గానీ, ఇనుప పెట్టతో పాటు యజమాని పడకగది వంటివి రావచ్చును. పశ్చిమ గోడకు లేదా దక్షిణము గోడకు మెట్లు రావచ్చును. సౌధ్యమైనంత వరకు ఉత్తరము, తూర్పు భాగములందు మెట్లు రాకుండా చూసుకోవడమే మంచిది.
అన్నిటికంటే ఉత్తమము ఇంటిలోపల మెట్లను దక్షిణము గోడకు ఆనించి గానీ, ఆనించకుండా గానీ, పశ్చిమ గోడకు మెట్లు ఆనించి గానీ, ఆనించకుండా గానీ వేసుకోవడం శ్రేష్టము.


ఒక వేళ ఇంటిలోపల రౌండ్ మెట్లను నిర్మించదలిస్తే తూర్పు వైపునగానీ లేదా ఉత్తరవైపున గానీ వేసుకోవచ్చు. అయితే మేడ పైన గదిలోనికి ప్రవేశం మాత్రము ఈశాన్యం లోనికి ఉండులాగున మెట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మెట్లను ఉత్తరము మరియు తూర్పు గోడలకు అంటకుండా వేసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.

అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందట.

గృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వాస్తవానికి వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.


మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుందట.


అదేవిధంగా అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుందని చెపుతున్నారు. జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుందని, పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెపుతున్నారు.


వత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని చెపుతున్నారు. అదేవిధంగా కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా, ఇంటిపై ఎలాంటి మాంత్రికశక్తులు పని చేయవని అంటున్నారు.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. సంపద, శ్రేయస్సు పొందడానికి కొన్ని నియమాలు సాయంత్రంపూట పాటించాలి

పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టారు. అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేని వాళ్ళు పాటించరు. అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం సమయంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ..  సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు.. మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట. హిందువుల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు.




సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీకు తెలుసా? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..




తులసిని పూజించకూడదు:
హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసీని పూజించడం,ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. తులసి మొక్కను పూజించడం, నీళ్లు పోయడం చాలా పవిత్రంగా భావిస్తాం. కానీ.. సాయంత్రంపూట ఇది మంచిది




నెయ్యి దీపం వెలిగించొచ్చు:
సూర్యాస్తమయం తరివాత తులసిని పూజించకూడదని బాధ పడుతున్నారా? చింతించకండి సూర్యాస్తమయం తరువాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించొచ్చు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే.. లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షించవచ్చు.





చెత్త ఊడవకూడదు:

సూర్యాస్తమయం తరువాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల.. మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట. ఈ విషయం చాలా మంది ఆడవాళ్ళకు తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు ఇక నుంచి ఈ పని చెయ్యకండి.



శృంగారం చెయ్యకూడదు:
సాయంత్రం సమయంలో.. సెక్స్ చెయ్యడం, శారీరకంగా కలవడం వంటి పనులు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. సాయంత్రం సమయంలో శారీరక సంబంధం.. దురదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి శృంగార ప్రియులు ఇక నుంచి ఆ పనులు పగటి పూటే కానిచ్చేయండి.





నిద్రపోకూడదు:
ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసిన పెద్దగా పట్టించుకోరు. సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే.. ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు.. కారణం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక నుండి సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకండి.






తిన్న వెంటనే కడిగేయాలి:
ఆహారం తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే.. శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు. కాబట్టి ఇక నుంచి తిన్న వెంటనే శుభ్రం చేసేయండి.





చదువుకోకూడదు:

ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు, సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోకూడదు అట. ఎందుకంటే పురాణాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.






ఆటలు ఆడితే చాలా మంచిది:
సాయంత్రంపూట ఇంట్లో కూర్చుని చదువుకోవడం కన్నా.. పిల్లలు బయట ఆడుకోవడం లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం చాలా మంచిదట. ఇది ఎలాగో పిల్లలు చేసేదే. అయితే కొంతమంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని ఆటలకు పంపించారు. ఈ విషయం ఆ తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి.






పరిసరాలు శుభ్రంగా ఉంచాలి:
మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో, ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల.. మీ చుట్టు పక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. కాబట్టి ఇక నుంచి ఇలాంటి పనులు చేసే వాళ్ళు మానుకోండి.








లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..

లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్లు.. ధనంతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే.. ఎక్కడైతే.. ఎక్కువ భక్తి, అనుకూలంగా ఉంటుందో.. అక్కడికి లక్ష్మీదేవి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడూ.. లక్ష్మీదేవిను పూజిస్తూ ఉండాలి.


సీతాఫ‌లాన్నితిన‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల పోష‌కాలు అనేక ర‌కాల లాభాలు క‌లుగుతాయి

ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో సీతాఫ‌లం కూడా ఒక‌టి. అత్యంత తియ్య‌ని రుచిని క‌లిగి ఉండ‌డ‌మే కాదు, ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.




 సీజ‌న‌ల్ ఫ్రూట్‌గా మ‌న‌కు ల‌భించే సీతాఫ‌లంలో విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఈ కాలంలో ఎక్కువ‌గా
తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.




సీతాఫ‌లాన్ని ఉద‌యాన్నే అల్పాహారంగా తీసుకుంటే దాంతో కండ‌రాలు, న‌రాల బ‌ల‌హీన‌త‌లు తొల‌గిపోతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది.


విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కంటి రోగాలు తొల‌గిపోతాయి. దృష్టి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
సీతాఫ‌లంలో ఉండే మెగ్నిషియం గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. వీటిలో ఉండే పోష‌కాలు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి.



సీతాఫ‌లాన్ని రోజూ తింటుంటే క‌డుపులో ఉండే నులిపురుగు చ‌నిపోతాయి. అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.






ర‌క్తం త‌క్కువగా ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తిన‌డం మంచిది. దీంతో ర‌క్తం త‌యార‌వుతుంది.
శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తింటే వెంట‌నే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
చిన్నారులు, బాలింత త‌ల్లుల‌కు సీతాఫ‌లం చ‌క్క‌ని పోష‌కాల‌ను అందిస్తుంది. వారికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది




.
ఎదుగుతున్న పిల్లలు నిత్యం సీతాఫ‌లాన్ని తింటుంటే దాంతో కాల్షియం వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి.

శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో సీతాఫ‌లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది

పవిత్రమైన తులసి వినాయకుడు యిష్టపడక పోవడానికి కారణం ఏమిటి?

వినాయక చవితి రోజు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి ఆ గణనాథున్ని పూజిస్తారు. కానీ ఆ పత్రాల్లో తులసి ఆకు ఉండదు. సర్వ దేవతలకు

పవిత్రమైన తులసి వినాయకుడు యిష్టపడక పోవడానికి కారణం ఏమిటి అని మన మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి సమాధానం కావాలంటే ఇది చదవండి..



పురాతన కాలం నుండి తులసి మొక్క గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఒక సారి వినాయకుడు గంగానది ఒడ్డును కూర్చుని, తపస్సు చేస్తుంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకున్ని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.



అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు.
అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా, అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం పెడుతుంది.




ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్నీ కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని, వినాయకుడు తులసికి శాపం పెడతాడు.




కాగా వినాయకుడు శాప విమోచన చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతే కాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని వివరించి, తులసికి వరం ఇస్తాడు.




తర్వాత తులసి, శంక చూద అనే రాక్షసున్ని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజు పాటు కష్టాలను అనుభవించి, ఆమె మరణిస్తుంది. మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది.



అప్పటి నుండి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు.




అంతే కాదు, తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు.



ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు.




చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసినా, తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుందట. దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

శివుడికి ముగ్గురు కూతుళ్లు ?? శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్లు ఎందుకు కాలేదు

కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప.. ఈ ముగ్గురూ.. శివుడి కొడుకులని మనందరికి తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని..చాలా తక్కువ మందికి మాత్రమే.. తెలుసు. అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు ?



 శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్లు ఎందుకు కాలేదు. శివుడి ముగ్గురు కూతుళ్లను, కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు. అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో.. శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శిడుకి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్లు ఎలా జన్మించారు ? ఎప్పుడు పుట్టారు ? ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం..




శివ పుత్రికలు
శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.


అశోక సుందరి
పార్వతి దేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం.. అశోక సుందరిని సృష్టించారు.
పద్మపురాణం
పద్మ పురాణంలో.. అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తీగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా.. అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతిదేవి సృష్టించింది.




పేరులోని అర్థం
అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే.. అందమైన అని అర్థం.
వినాయకుడి తల
శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు.. భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని.. ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా.. జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో పూజిస్తారు.





జ్యోతి
ఈమె పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపు, శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి.
దేవత
జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి.. ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతిదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు.






పూజించడం
జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి.. జ్వాలాముఖిగా పూజిస్తారు.
మానస
శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల.. పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతి కూతురు కాదని వివరిస్తాయి.




వాసుకి సోదరి
వాసుకి సోదరి మానస అని.. బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే.. పాముల రాజు.
కోపం, సంతోషం లేకపోవడం
తన తండ్రి, భర్త, పార్వతి దేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా.. ఉంటుందని.. కథలు ఉన్నాయి.
పూజించడం

మానసను.. బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను.. ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే.. ఆ సమయంలో పాములు యాక్టివ్ గా ఉంటాయి. అలాగే.. ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.

కివీ పండు తింటే మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు తగ్గిస్తాయి

కివీ ఫ్రూట్ తో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ పండును ఒక మెడిసెన్ గా మనం గుర్తిస్తాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కివీ ఫ్రూట్ కనీసం రోజుకు రెండు, మూడు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తుంది.
అంతేకాదు శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం ఈ కివీలలో ఉంటంతో చాలామంది వైద్యులు ఈ పండ్లు తినమని సలహాలు కూడ ఇస్తున్నారు. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా ఈ పండ్లు తినడం వల్ల మనకు మేలు కలుగుతుందని అనేక పరిశోధనలు కూడ తెలియచేస్తున్నాయి.





రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా సహకరించే ఈ ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటంతో కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు కూడ ఈ ఫ్రూట్స్ ఉపయోగ పడతాయి అని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.





మన శరీరంలోని రక్త సరఫరా మెరుగుపరచడానికి అదేవిధంగా శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగించ డానికి ఈ కివీ పండ్లు ఎంతో సహకరిస్తాయి. ఈ పండ్లు తినడం వల్ల గుండెకు ప్రయోజనం చేకూరడమే కాకుండా రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది.



ముఖ్యంగా రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.





కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే కివీ పండ్లను వీలైనంత ఎక్కువ తినడం మంచింది..