Translate

Friday, 2 December 2016

తడి కాళ్లతో పడుకుంటే జరిగే అనర్ధం తెలుసా?

మనజీవితం ఆనందంగా ఉండాలంటే సిరిసంపదలు కావాలి… అవి పుష్కలంగా ఉండాలంటే లక్ష్మి దేవి అనుగ్రహం కావాలి. శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు చెయ్యకూడదు. ఆతల్లి ఆగ్రహానికి లోను కాకుండా ఉంటె అనుగ్రహానికి దగ్గరయినట్టే. అందుకే అక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో చేయకూడదో మన శాస్త్రాలలో తెలిపిన కొన్ని విషయాలు తెలుసుకుని ఆచరిద్దాం…


శివుడు లేదా శ్రీ మహా విష్ణువుని తప్పక పూజించాలి.
చీపురుని కాలితో తొక్కడం చేయకూడదు.
ఇంటి ఆవరణంలోని బావులను పూడ్చకూడదు.
ఇంట్లో వాళ్లకు కాకుండా తల నూనెను మరోకరికి రాయకూడదు.
అనవసరంగా గడ్డి పరకలను తుంచేయకూడదు
తులసి చెట్టును ఇంట్లో పెట్టుకొని పూజించాలి
తడి పాదాలతో నిద్రపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు.

గోవర్ధనగిరి గురించి చాలా మందికి తెలియని నిజాలు… కలియిగ అంతానికి గోవర్ధనగిరికి ఉన్న సంబందమేమిటో తెలుసా?

ద్వాప‌ర యుగంలో ప‌డిన భారీ వ‌ర్షానికి, తుఫానుకు ఇండ్లు, గొడ్డు, గోదా, మ‌నుషులు అంద‌రూ కొట్టుకుపోతుంటే వారిని ర‌క్షించిన శ్రీ‌కృష్ణుడు వారికి ఆశ్ర‌యం ఇవ్వ‌డం కోసం గోవ‌ర్ధ‌నగిరిని తన చిటికెన వేలిపై ఎత్తాడు. అయితే ఇప్పుడు ఆ గోవ‌ర్ధ‌న‌గిరి ప‌ర్వ‌తం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ధుర అనే ప్రాంతంలో ఉంది. ఈ ప‌ర్వ‌తం ప్ర‌తి ఏటా ఆవ గింజంత ప‌రిమాణంలో ఆకారం త‌గ్గుతూ వ‌స్తుంద‌ట‌. అలా త‌గ్గుతూ త‌గ్గుతూ అక్క‌డి భూమితో స‌మ‌త‌లంగా ఎప్పుడైతో మారుతుందో అప్పుడే ఈ భూమితోపాటు క‌లియుగం కూడా అంత‌మ‌వుతుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబందించిన కథ కూడా ఉంది.




పూర్వం ప‌ర్వ‌తాల‌కు రాజైన ద్రోణ‌క‌ల అనే అత‌నికి గోవ‌ర్ధ‌నుడు, యమున ఇద్ద‌రూ జ‌న్మించార‌ట‌. గోవ‌ర్ధ‌నుడు గోవర్ధ‌న ప‌ర్వ‌తంగా అవ‌తారం ఎత్త‌గా, య‌మున న‌దిగా మారి ప్రవహించింది.  బ్ర‌హ్మ దేవుడి మ‌న‌వ‌డు, గొప్ప రుషి అయిన పుల‌స్త్యుడు ద్రోణ‌క‌లుడి ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి గోవ‌ర్ధ‌న ప‌ర్వ‌తం కాశీలో ఉండాల‌ని, అక్క‌డ ఉంటే పూజాది కార్య‌క్ర‌మాల‌కు బాగా అనువుగా ఉంటుంద‌ని చెబుతాడు. దీనికి ద్రోణ‌క‌లుడు అంగీక‌రించి గోవ‌ర్ధ‌నున్ని పుల‌స్త్యునితో వెళ్ల‌మ‌ని చెప్పగా… దానికి గోవ‌ర్ధ‌నుడు మొద‌ట సరే అని తరవాత ఓ చిన్న పెడతాడు. త‌న‌ను మోసుకుని వెళ్లేట‌ప్పుడు మార్గ‌మ‌ధ్య‌లో అస్స‌లు కింద పెట్ట‌కూడ‌ద‌ని, అలా పెడితే తాను రాన‌ని, కాశీ వ‌ర‌కు త‌న‌ను దింప‌కుండా అలాగే తీసుకెళ్లాల‌ని గోవ‌ర్ధ‌నుడు చెబుతాడు. దీనికి పుల‌స్త్యుడు అంగీక‌రించి అలాగే చేస్తాడు.

కార్తీకమాసంలో చేయకూడని 10 పనులు ఏమిటంటే…

కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికి తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పుజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విదిగా చేస్తారు. ఈమాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం…
1.తామసం కలిగించే ఉల్లి తినకూడదు.
2.వెల్లుల్లి తినకూడదు.
3.మద్యం, మాంసం జోలికి పోకూడదు.


4.ఎవ్వరికి ద్రోహం చెయ్యరాదు.
5.పాపపు ఆలోచనలు చేయకూడదు.
6.దైవ దూషణ చేయకూడదు.
7.దీపారాదనకు తప్ప నువ్వులనూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు.
8.మినుములు తినకూడదు.
9.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
10.కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.

ఒక్క రోజులో ఈ అందమైన అమ్మాయి ఎలా స్టార్ గా ఎదిగిందో తెలుసా?

సినిమా అవకాశాలు రావాలంటే తెలిసిన వారు ఉండాలి, లేదా చాలా కష్టాలు పడాలి ఇలాంటి రోజులకు ఫుల్ స్టాప్ పెట్టింది సోషల్ మీడియా. ఎవరిలో ఏ టాలంట్ ఉన్నా సోషల్ మీడియాలో పెడితే చాలు అది అలా హల్చల్ అయిపోతుంది. ఇటీవల ఇస్లామాబాద్ కి చెందిన అర్షద్ ఖాన్ అనే యువకుడు.. నీలి కళ్ళతో చాయ్ అమ్ముకుంటూ ఉన్న ఫోటోలో.. అతడి గ్లామర్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యి, దీనితో అతనికి టివి షో, మోడలింగ్ లలో అవకాశం రావడం తెలిసిన విషయమే.


ఇప్పుడు తాజాగా.. నేపాల్ కి చెందిన కూరగాయలు అమ్ముకుంటున్న యువతి అందానికి సోషల్ మీడియా షాక్ కి గురి అయింది. నేపాల్ కి చెందిన రుపీచంద్ర మహర్జాన్ అనే ఫోటో గ్రాఫర్.. ఈ ఫోటోలను తీసి సోషల్ మీడియా లో ఉంచడంతో ఆమె అందం, నవ్వు, లుక్, స్టైల్ లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేయడంతో.. రాత్రికి రాత్రి ఆమె స్టార్ గా మారింది. ఆమె అందానికి సోషల్ మీడియా లో యువకులు కూడా నీరాజనం పడుతుంటే మరోపక్క  జాతీయ మీడియా లో కూడా ఆ యువతి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని అనుకుంటున్నారు.

పాము కలలో కన్పిస్తే – ఏం జరుగుతుంది…

నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.



పాము కలలో కన్పిస్తే ఏం జరుగుతుందో? ఏమో? అని అందరూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉంటారు. మీ కలలో పాము కన్పించి, అది కాటేసి వెళ్లిపోతే.. ఇకపై ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.



అదేవిధంగా.. పాము స్వప్నంలో కన్పించి, ఏమీ చెయ్యకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖసంతోషాలతో ఉంటారు.

జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకోండి

జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకోండి.
ఈ సీజన్స్ లలో ఎక్కువగా మనకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాని నుండి వచ్చే పండ్ల పైన అంతగా దృష్టి పెట్టలేరు.మనలో చాలా మంది ఏదైతే చవకగా దొరుకుందో దానిని పట్టించుకోరు, ఏదైతే చాలా ఖరీదైంది ఉంటుందో దాని వెంట పడుతుంటారు. కానీ చవకగా దొరికే దానిలో విలువైనవి ఉంటే ….. అబ్బా దీనిని అనవసరంగా ఇన్ని రోజులు మిస్ అయ్యాము అనుకుంటారు. అలాంటి వాటిలో మన పెరటిలో పండే పండ్లలలో మొదటిగా ఉండేది జామపండు ఒకటి. దీనిలో ఉండే పోషాకాలు మనకు మరి ఏ ఇతర పండ్లు ఇవ్వదు అని చెప్పవచ్చు.
జామపండు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:
జామపండులో ఏ,బి,సి, విటమిన్స్ అధికంగా ఉంటాయి.
ఈ పండులో పోషకాలు, పీచు ఎక్కువ గా ఉండి, కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు జామపండు తింటే చాలా మంచింది.
జామపండు తినడం వలన మలబద్దకం చాలా వరకు తగ్గుతుంది.
షుగర్ ఉన్నవారికి జామపండు చాలా మంచింది.
కమల పండులో దొరికే విటమిన్ సి కన్నా జామపండులో 5 రేట్లు అధికంగా లభిస్తుంది.
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ఉత్తమం అంటారు కధ!. ఆకు కూరల్లో దొరికే పీచు కంటే జామలో రెండు రేట్లు ఎక్కువగా దొరుకుంది.
ఆపిల్ లో ఉండే పిచ్ కంటే జామలో అధికంగా ఉంటుంది.
పది ఆపిల్స్ లలో ఉండే పోషకాలు ఒక్క జామకాయలోనే ఉంటాయి.

తిరుమల సన్నిధి తొలిదర్శన “భాగ్యం” ఎవరికో తెలుసా …?

లక్ష్మీదేవి కోసం భూలోకంలో వెతికివెతికి వేసారిన శ్రీనివాసుడు ఆకలితో అలమటిస్తూ వేంకటాచల పర్వతాన్ని చేరుకున్నారు. పుష్కరిణికి దక్షిణం వైపు ఒడ్డునున్న చింతచెట్టుకింద పుట్టలో చేరి ఆకలితో అలమటిస్తున్నాడు. స్వామివారి ఆకలిని తీర్చేందుకు శివుడు, బ్రహ్మ … లక్ష్మీదేవిని వేడుకుంటారు. బ్రహ్మ గోవుగా, శివుడు దూడగా … లక్ష్మి గోపాలికగా అవతారం ఎత్తుతారు.

అసాధారణమైన దేవతాంశ కలిగిన ఆవుదూడ అని చెప్పి చోళరాజు ఆస్థానానికి వెళ్ళి ఆవును విక్రయిస్తుంది గోపాలిక. అడవికి మేతకు వెళ్ళిన ఆవు గొల్లవాని కన్నుగప్పి పుట్టలో ధారగా పోసి పుట్టలో ఉన్న శ్రీనివాసుని ఆకలిని తీరుస్తుంది. ప్రతిరోజూ ఈ విధంగానే పోసి ఏమీ ఎరగనట్టు గొల్లమందలో చేరి చోళరాజు గోశాలకు చేరుకునేది. దేవతాంశ ఉట్టిపడే ఆ ఆవుపాలు రాజుగారిచే తాగించాలని ఉవ్విళ్ళూరిన మహారాణి గొల్లవానిపై ఆగ్రహిస్తుంది, రాజుకు ఫిర్యాదు చేస్తుంది. గొల్లవాడే ఆ పాలను తాగేస్తున్నాడని భ్రమించిన రాజు అతన్ని దండిస్తాడు.


మరుసటిరోజు అసలు గుట్టేమిటో రాబట్టాలన్న కృతనిశ్చయంతో గొల్లవాడు పశువులను తోలుకెళతాడు. యథాప్రకారం కొండలు, గుట్టలు దాటుకుంటూ పుష్కరిణి సమీపంలో ఉన్న పుట్టను ఎక్కి దాని బోరియలో పాలను ధారగా ఇస్తుంటుంది. అది చూసిన పశువుల కాపరి మెల్లమెల్లగా, నక్కినక్కి ఆవు దగ్గరికి చేరతాడు. గొడ్డలిని ఎత్తిపెట్టి ఒక్క వేటు వేస్తాడు. ఆవు బెదిరి పక్కకు తప్పుకుంటుంది. పుట్టలో దాగివున్న శ్రీనివాసుడు గభాలున పైకి లేస్తాడు. గొడ్డలి వేటు ఆయనకు తగులుతుంది, నుదుట గాయమవుతుంది.




నెత్తురు చూసిన గొల్లవాడు “అయ్యో! ఎంతపని చేశాను … స్వామీ క్షమించు” అంటూ భీతిల్లి శ్రీనివాసుని కళ్ళల్లోకి చూస్తూ మరణిస్తాడు. “ఈ భూలోకంలో తొలిగా నన్ను దర్శించిన ఈ గొల్లవాని పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది. కలియుగాంతం వరకూ ప్రతిరోజూ మొట్టమొదట నన్ను దర్శించే మహాద్భాగ్యాన్ని ఈ గొల్లవాని సంతతికి కల్పిస్తానని శ్రీనివాసుడు అతని మృతదేహం వద్ద ఉన్న సంతతికి వరమిస్తాడు.
ఈ నేపథ్యంలోనే ఈ ఆచారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇప్పటికీ అమలులో ఉండటం విశేషం.