Translate

Friday, 2 December 2016

గుడ్డు తో గుండెపోటుకు చెక్

గుండెపోటు రాకుండా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు..డైటింగ్ చేస్తుంటారు. అయితే మనం రోజు తీసుకునే ఫుడ్ లో గుడ్డు ఉంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు 





సైంటిస్టులు. రోజు గుడ్డు తింటే అది గుండెకు ఎంతో మేలు చేస్తుందట. అంతే కాదు గుండె నొప్పి వచ్చే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందట. అమెరికాలోని మిచిగాన్ డొమినిక్ అలెగ్జాండర్ ఆఫ్ ద ఎపిడ్ స్టాట్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన పరిశోధన బృందం ఈ విషయాలను తెలిపింది. దీనికి సంబంధించిన పరిశోధనలు 33 ఏళ్ల పాటు జరిపారు…ఇందులో దాదాపు 27 లక్షల మంది పాల్గొన్నారు.


గుడ్డు తినని వారికే ఎక్కువగా ఛాతీనొప్పి, ఛాతీ సంబంధిత సమస్యలు వచ్చినట్టు తేలింది. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని సూచించారు. గుడ్డులో నాణ్యమైన ప్రొటీన్, విలువైన పోషక పదార్థాలు ఉన్నాయని, విటమన్ ఈ, డీ, ఏ ఉన్నాయని చెప్పారు.

वैज्ञानिकों। दिल के दिन अंडे की खपत यह सबसे अधिक लाभ होगा। इसके अलावा, 12 फीसदी taggistundata से दिल के दौरे का खतरा। यूनाइटेड स्टेट के अनुसंधान दल में मिशिगन के संस्थान के Epid डोमिनिक अलेक्जेंडर इन बातों को कहा। अनुसंधान लगभग 27 लाख लोगों के लिए 33 साल की उम्र में किया गया था ... इसके अलावा में भाग लिया।जिन लोगों ने अंडे chatinoppi, छाती से संबंधित समस्याओं को नहीं खाया के अधिकांश आ गया था। अंडे की दैनिक सुझाव सेवन के कारण हृदय संबंधी समस्याओं के जोखिम को कम। अंडे की गुणवत्ता प्रोटीन, विटामिन यह, डी सहित मूल्यवान पोषक तत्वों, ने कहा कि वहाँ कोई कर दिया गया है।

ఏచెయ్యి దురదపుడితే ధనం వస్తుంది లేక పొతుందో తెలుసా?

మనిషి ఎన్నో ఆచారాలతో నమ్మకాలతో బ్రతుకుతుంటాడు. పెద్దలు, పూర్వీకులు, పుస్తకాలు చెప్పిన ఎన్నో విశ్వాసాను నమ్ముతుంటారు. అలాంటి విశ్వాసాల్లో… చేతుల దుర‌ద కూడా ఒక‌టి. చేతులు దురద కూడా ఒక విశ్వాసమా? అని అనుకుంటున్నారా? అవును కుడికన్ను అదిరితే ఇలా మంచిది అలా మంచిది అని అంటారు కాదా… అలనే చేయి దురదపెడితే మంచి, చెడు కూడా ఉంటాయి. చేతుల‌కు దుర‌ద క‌లిగితే దాన్ని బ‌ట్టి డ‌బ్బు వ‌స్తుందో,  పోతుందో సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చ‌ట‌.


న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఈ విశ్వాసాన్ని పాటించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో కుడి చేయి దురద పెడితే డబ్బులు వస్తాయి, అదే ఎడమ చేయి దురదపెడితే ధనం ఖర్చు అవుతాది. కాని చేయి దుర‌ద పెట్టిన‌ప్పుడు దాన్ని రుద్దకుండా… అందుకు బ‌దులుగా చేయిని మ‌డ‌వాలి! అలా చేస్తే… ధనం వస్తుందంట. అదే ఎడమ చేయి దురద పెడితే ధనం విపరీతంగా ఖర్చు అవుతుందంట.

తడి కాళ్లతో పడుకుంటే జరిగే అనర్ధం తెలుసా?

మనజీవితం ఆనందంగా ఉండాలంటే సిరిసంపదలు కావాలి… అవి పుష్కలంగా ఉండాలంటే లక్ష్మి దేవి అనుగ్రహం కావాలి. శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు చెయ్యకూడదు. ఆతల్లి ఆగ్రహానికి లోను కాకుండా ఉంటె అనుగ్రహానికి దగ్గరయినట్టే. అందుకే అక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో చేయకూడదో మన శాస్త్రాలలో తెలిపిన కొన్ని విషయాలు తెలుసుకుని ఆచరిద్దాం…


శివుడు లేదా శ్రీ మహా విష్ణువుని తప్పక పూజించాలి.
చీపురుని కాలితో తొక్కడం చేయకూడదు.
ఇంటి ఆవరణంలోని బావులను పూడ్చకూడదు.
ఇంట్లో వాళ్లకు కాకుండా తల నూనెను మరోకరికి రాయకూడదు.
అనవసరంగా గడ్డి పరకలను తుంచేయకూడదు
తులసి చెట్టును ఇంట్లో పెట్టుకొని పూజించాలి
తడి పాదాలతో నిద్రపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు.

గోవర్ధనగిరి గురించి చాలా మందికి తెలియని నిజాలు… కలియిగ అంతానికి గోవర్ధనగిరికి ఉన్న సంబందమేమిటో తెలుసా?

ద్వాప‌ర యుగంలో ప‌డిన భారీ వ‌ర్షానికి, తుఫానుకు ఇండ్లు, గొడ్డు, గోదా, మ‌నుషులు అంద‌రూ కొట్టుకుపోతుంటే వారిని ర‌క్షించిన శ్రీ‌కృష్ణుడు వారికి ఆశ్ర‌యం ఇవ్వ‌డం కోసం గోవ‌ర్ధ‌నగిరిని తన చిటికెన వేలిపై ఎత్తాడు. అయితే ఇప్పుడు ఆ గోవ‌ర్ధ‌న‌గిరి ప‌ర్వ‌తం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ధుర అనే ప్రాంతంలో ఉంది. ఈ ప‌ర్వ‌తం ప్ర‌తి ఏటా ఆవ గింజంత ప‌రిమాణంలో ఆకారం త‌గ్గుతూ వ‌స్తుంద‌ట‌. అలా త‌గ్గుతూ త‌గ్గుతూ అక్క‌డి భూమితో స‌మ‌త‌లంగా ఎప్పుడైతో మారుతుందో అప్పుడే ఈ భూమితోపాటు క‌లియుగం కూడా అంత‌మ‌వుతుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబందించిన కథ కూడా ఉంది.




పూర్వం ప‌ర్వ‌తాల‌కు రాజైన ద్రోణ‌క‌ల అనే అత‌నికి గోవ‌ర్ధ‌నుడు, యమున ఇద్ద‌రూ జ‌న్మించార‌ట‌. గోవ‌ర్ధ‌నుడు గోవర్ధ‌న ప‌ర్వ‌తంగా అవ‌తారం ఎత్త‌గా, య‌మున న‌దిగా మారి ప్రవహించింది.  బ్ర‌హ్మ దేవుడి మ‌న‌వ‌డు, గొప్ప రుషి అయిన పుల‌స్త్యుడు ద్రోణ‌క‌లుడి ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి గోవ‌ర్ధ‌న ప‌ర్వ‌తం కాశీలో ఉండాల‌ని, అక్క‌డ ఉంటే పూజాది కార్య‌క్ర‌మాల‌కు బాగా అనువుగా ఉంటుంద‌ని చెబుతాడు. దీనికి ద్రోణ‌క‌లుడు అంగీక‌రించి గోవ‌ర్ధ‌నున్ని పుల‌స్త్యునితో వెళ్ల‌మ‌ని చెప్పగా… దానికి గోవ‌ర్ధ‌నుడు మొద‌ట సరే అని తరవాత ఓ చిన్న పెడతాడు. త‌న‌ను మోసుకుని వెళ్లేట‌ప్పుడు మార్గ‌మ‌ధ్య‌లో అస్స‌లు కింద పెట్ట‌కూడ‌ద‌ని, అలా పెడితే తాను రాన‌ని, కాశీ వ‌ర‌కు త‌న‌ను దింప‌కుండా అలాగే తీసుకెళ్లాల‌ని గోవ‌ర్ధ‌నుడు చెబుతాడు. దీనికి పుల‌స్త్యుడు అంగీక‌రించి అలాగే చేస్తాడు.

కార్తీకమాసంలో చేయకూడని 10 పనులు ఏమిటంటే…

కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికి తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పుజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విదిగా చేస్తారు. ఈమాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, పండితులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం…
1.తామసం కలిగించే ఉల్లి తినకూడదు.
2.వెల్లుల్లి తినకూడదు.
3.మద్యం, మాంసం జోలికి పోకూడదు.


4.ఎవ్వరికి ద్రోహం చెయ్యరాదు.
5.పాపపు ఆలోచనలు చేయకూడదు.
6.దైవ దూషణ చేయకూడదు.
7.దీపారాదనకు తప్ప నువ్వులనూనె ఇంక దేనికి ఉపయోగించకూడదు.
8.మినుములు తినకూడదు.
9.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
10.కార్తీక వ్రతం పాటించేవారు, ఆ వ్రతం చేయనివారి చేతి వంట తినకూడదు.

ఒక్క రోజులో ఈ అందమైన అమ్మాయి ఎలా స్టార్ గా ఎదిగిందో తెలుసా?

సినిమా అవకాశాలు రావాలంటే తెలిసిన వారు ఉండాలి, లేదా చాలా కష్టాలు పడాలి ఇలాంటి రోజులకు ఫుల్ స్టాప్ పెట్టింది సోషల్ మీడియా. ఎవరిలో ఏ టాలంట్ ఉన్నా సోషల్ మీడియాలో పెడితే చాలు అది అలా హల్చల్ అయిపోతుంది. ఇటీవల ఇస్లామాబాద్ కి చెందిన అర్షద్ ఖాన్ అనే యువకుడు.. నీలి కళ్ళతో చాయ్ అమ్ముకుంటూ ఉన్న ఫోటోలో.. అతడి గ్లామర్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యి, దీనితో అతనికి టివి షో, మోడలింగ్ లలో అవకాశం రావడం తెలిసిన విషయమే.


ఇప్పుడు తాజాగా.. నేపాల్ కి చెందిన కూరగాయలు అమ్ముకుంటున్న యువతి అందానికి సోషల్ మీడియా షాక్ కి గురి అయింది. నేపాల్ కి చెందిన రుపీచంద్ర మహర్జాన్ అనే ఫోటో గ్రాఫర్.. ఈ ఫోటోలను తీసి సోషల్ మీడియా లో ఉంచడంతో ఆమె అందం, నవ్వు, లుక్, స్టైల్ లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేయడంతో.. రాత్రికి రాత్రి ఆమె స్టార్ గా మారింది. ఆమె అందానికి సోషల్ మీడియా లో యువకులు కూడా నీరాజనం పడుతుంటే మరోపక్క  జాతీయ మీడియా లో కూడా ఆ యువతి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని అనుకుంటున్నారు.

పాము కలలో కన్పిస్తే – ఏం జరుగుతుంది…

నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.



పాము కలలో కన్పిస్తే ఏం జరుగుతుందో? ఏమో? అని అందరూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉంటారు. మీ కలలో పాము కన్పించి, అది కాటేసి వెళ్లిపోతే.. ఇకపై ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.



అదేవిధంగా.. పాము స్వప్నంలో కన్పించి, ఏమీ చెయ్యకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖసంతోషాలతో ఉంటారు.