వినాయక చవితి రోజు అనేక పత్రాలను, పూలను
తీసుకువచ్చి ఆ గణనాథున్ని పూజిస్తారు. కానీ ఆ పత్రాల్లో తులసి ఆకు ఉండదు.
సర్వ దేవతలకు
పవిత్రమైన తులసి వినాయకుడు యిష్టపడక పోవడానికి కారణం ఏమిటి అని మన మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి సమాధానం కావాలంటే ఇది చదవండి..
పురాతన కాలం నుండి తులసి మొక్క గురించి ఒక
కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఒక సారి వినాయకుడు గంగానది ఒడ్డును
కూర్చుని, తపస్సు చేస్తుంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి
వినాయకున్ని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తనను
పెళ్లి చేసుకోమని అడుగుతుంది.
అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా, అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం పెడుతుంది.
ఈ క్రమంలో ఆగ్రహానికి
లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం
జరుగుతుందని, అతని వల్ల అన్నీ కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని, వినాయకుడు
తులసికి శాపం పెడతాడు.
కాగా వినాయకుడు శాప
విమోచన చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క
లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతే కాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు
ఉంటాయని వివరించి, తులసికి వరం ఇస్తాడు.
తర్వాత తులసి, శంక చూద
అనే రాక్షసున్ని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజు పాటు కష్టాలను
అనుభవించి, ఆమె మరణిస్తుంది. మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది.
అప్పటి నుండి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు.
అంతే కాదు, తులసి మొక్కలో
ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి
పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు.
ఎందుకంటే వారిద్దరి మధ్య
జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో
తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మహిళలు నిత్యం
తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు.
చనిపోతున్న వారి నోట్లో
తులసి తీర్థం పోసినా, తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే
పోతుందట. దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన
ప్రయోజనాలు కూడా ఉన్నాయి.